మంత్రి మల్లారెడ్డి అక్రమ నిర్మాణాలు..పర్మిషన్లు తీసుకోకుండానే  వరంగల్ హైవేకు ఆనుకుని పనులు?

ఘట్ కేసర్, వెలుగు :  వరంగల్ హైవేకు ఆనుకుని మంత్రి మల్లారెడ్డి  షాప్​లను నిర్మిస్తుండగా.. వాటికి గ్రామ పంచాయతీ అనుమతులు తీసుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  దీనిపై పంచాయతీ కార్యదర్శిని అడిగితే.. ‘మంత్రి నిర్మాణాలకు పర్మిషన్లు ఎందుకు అంటూ..? వివరణ ఇవ్వడం గమనార్హం. పంచాయతీ ఉన్నాధికారులు కూడా షాపులపై చర్యలకు జంకుతున్నారు.

ALSO READ: బీజేపీ టికెట్​ కోసం.. బీఆర్ఎస్ కు గుడ్​ బై చెప్తున్న లీడర్లు

మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలం వెంకటాపూర్ పంచాయతీ పరిధిలో వరంగల్ నేషనల్ హైవేకు ఆనుకొని ఉన్న స్థలంలో మంత్రి మల్లారెడ్డి  15 నుంచి 18 వరకు షాపులను నిర్మిస్తున్నారు. అయితే.. ఈ అక్రమ  నిర్మాణాలపై పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోకపోవడాన్ని   స్థానికులు తప్పుపడుతున్నారు.  ప్రతిపక్ష పార్టీల లీడర్లు సైతం దీని గురించి స్పందించకపోవడం విస్మయం  కలిగిస్తోందన్నారు.