విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు అవసరమే

విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా చాలా అవసరమన్నారు మంత్రి మల్లారెడ్డి.  హైదరాబాద్ నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో ఎమ్మెస్ ధోనీ క్రికెట్ అకాడమీని మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. క్రీడల్లో నెంబర్ వన్ గా ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణలో ధోనీ క్రికెట్ అకాడమీతో కలిసి పని చేయడం శుభపరిణామన్నారు మంత్రి మల్లారెడ్డి. గొప్ప కోచ్ లతో ఈ అకాడమీ ఏర్పాటైందని.. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ధోనీ స్ఫూర్తితో గొప్ప ప్లేయర్స్ కావాలని కోరుకుంటున్నాన్నారు. ఈ కార్యక్రమంలో  ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, స్పోర్ట్స్ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, డీపీఎస్ చైర్మన్ కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం

గురుకులాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయి

వ్యాక్సినేషన్లో తెలంగాణ నంబర్వన్