తిరుపతి : ఏపీలో గోదావరిపై కడుతున్న పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం సీఎం కేసీఆర్‌కే సాధ్యమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. సోమవారం ఉదయం మల్లారెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకొని మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రజలు బీఆర్ఎస్ వైపు ఆసక్తిగా చూస్తున్నారని తెలిపారు.
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని చెప్పారు. ఏపీలో గెలిపిస్తే కాళేశ్వరం లిఫ్ట్ ప్రాజెక్టు లెక్కనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని పేర్కొన్నారు.