
ఏపీ రాజకీయాలపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు మంత్రి మల్లారెడ్డి. కార్మిక దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో తెలంగాణ కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఏపీలో కుల రాజకీయాలు నడుస్తున్నాయని అని మల్లారెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ పవర్ ఎంటో అందరికీ తెలుసునని చెప్పారు. పోలవరం కట్టేది కేసీఆరే నని చెప్పిన మల్లారెడ్డి.. విశాఖ ఉక్కును కూడా ఆయన సాధిస్తారని అన్నారు.
పక్క రాష్ట్రాలలో కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నారని మల్లారెడ్డి తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లను తిడుతన్నారని వారికి కార్మికుల ఉసురు తగులుతుందంటూ మల్లారెడ్డి వ్యాఖ్యనించారు. కేసీఆర్ స్ఫూర్తి తోనే కార్మికులు కాళేశ్వరం, యాదాద్రి, అంబేద్కర్, సచివాలయాన్ని కట్టారని చెప్పారు. హైదరాబాద్ లో కార్మికులకు మంచి రోజులు వస్తాయని మల్లారెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వివిధ కేటగిరీలో కార్మికులకు అవార్డుల ప్రధానం చేశారు.