రిపోర్టర్ల ఫోన్లు గుంజుకుని తిట్టిన మంత్రి మల్లారెడ్డి

మునుగోడు ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ నేతలు, మంత్రి మల్లారెడ్డి అనుచరులు ఓవరాక్షన్ చేశారు. చౌటుప్పల్ మండలం ఆరెగూడ గ్రామంలో మంత్రి మల్లారెడ్డి  ప్రచారం నిర్వహించారు . ఈ సందర్భంగా మంత్రి ప్రచారాన్ని మీడియా ప్రతినిధులు వీడియో తీశారు. అయితే ఓటర్లతో మాట్లాడుతుంటే మీడియా ప్రతినిధులు వీడియో తీయటంపై  మల్లారెడ్డి అసహనం వ్యక్తం చేశారు.దీంతో రెచ్చిపోయిన అనుచరులు వీడియో తీస్తున్న రిపోర్టర్ల ఫోన్లు గుంజుకున్నారు. అంతటితో ఆగకుండా మీడియా ప్రతినిధులను తిట్టారు. అయితే మంత్రి మల్లారెడ్డి అనుచరుల ప్రవర్తనపై మీడియా ప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

ఇటీవల మునుగోడులో ప్రచారం చేసిన మల్లారెడ్డి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మందు  పార్టీ ఇస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అయితే తమ బంధువుల ఇంట్లో జరిగిన ఓ విందులో చుట్టాలకు మందు పోశానని, అందులో తప్పేముందని  మంత్రి మల్లారెడ్డి వివరణ ఇచ్చారు.