మహిళలకు గుడ్ న్యూస్: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడంటే..

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులేస్తోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు 5కీలక హామీలకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేసిన క్రమంలో వాటి అమలుపై దిశగా కసరత్తు మొదలైంది.ఈ క్రమంలో రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పథకంపై ఇప్పటికే కసరత్తు చేస్తున్నామని, త్వరలోనే అమలు చేస్తామని అన్నారు.

తెలంగాణ, కర్ణాటకలో అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణంలో ఎదురవుతున్న లోటుపాట్లు ఏపీలో తలెత్తకుండా చూస్తున్నామని అన్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్. రెండు రాష్ట్రల్లో అధ్యయనం చేసిన అనంతరం ఎప్పుడు అమలు చేయబోయేది ప్రకటిస్తామని అన్నారు.ఎవరికీ ఇబ్బంది కలగకుండా మహిళలకు ఉపయోగపడేలా ఈ పథకాన్ని అమలు చేస్తామని అన్నారు. అన్నీ అనుకూలిస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ఆగస్టు 15 నుండి అమలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.