మంత్రి హరీశ్ ను కలిసిన కాంట్రాక్ట్ ​ల్యాబ్ టెక్నీషియన్లను

మంత్రి హరీశ్ ను కలిసిన కాంట్రాక్ట్ ​ల్యాబ్ టెక్నీషియన్లను

హైదరాబాద్, వెలుగు: దశాబ్ద కాలంగా పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలోని కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్లు సోమవారం మంత్రి హరీశ్‌‌‌‌రావుకు వినతి పత్రం ఇచ్చారు. తెలంగాణ రాకముందు నుంచి సర్వీస్ చేస్తున్నామని, రాష్ట్రం వస్తే ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయని ఉద్యమంలో పాల్గొన్నామని మంత్రికి ఎల్టీలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తెలంగాణ వచ్చి పదేండ్లు అవుతున్నా, తమ గురించి పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. రెగ్యులర్ ల్యాబ్ టెక్నీషియన్ల మాదిరిగానే తాము కూడా అన్ని పనులు చేస్తున్నామని తెలిపారు. తమ విజ్ఞప్తి పట్ల మంత్రి సానుకూలంగా స్పందించారని ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఎం ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్‌‌‌‌ కవ్వం లక్ష్మారెడ్డి తెలిపారు. 

ALSO READ:కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ కన్నుమూత