
ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ సాగుతున్నాయి. వైసీపీకి ప్రతిపక్ష హోదా విషయంలో ఇరు పార్టీల మధ్య మాటల తుటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ మాజీ సీఎం, వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బుధవారం (మార్చి 5) జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘పవన్ కల్యాణ్ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ. ఆయన జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచారు’ అంతే అంటూ ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్‌పై జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసైనికులు మండిపడుతున్నారు.
ALSO READ | Ram Gopal Varma: ఆర్జీవీకి సీఐడీ అధికారులు నోటీసులు.. హైకోర్టును ఆశ్రయించిన వర్మ
ఈ క్రమంలోనే జగన్ వ్యాఖ్యలకు జనసేన కీలక నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ కౌంటర్ ఇచ్చారు. జగన్ కోడికత్తికి ఎక్కువ.. గొడ్డలికి తక్కువ అని మేం కూడా అనొచ్చు అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చారు నాదెండ్ల. అలాగే జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఎలా జరిగిందో కూడా అందరికి తెలుసన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని అలా కించపరుస్తూ మాట్లాడటం కరెక్ట్ కాదని జగన్‌కు చురుకలంటించారు నాదెండ్ల. మొత్తానికి పవన్‌పై జగన్ చేసిన కామెంట్స్ ఏపీలో హాట్ టాపిక్‌గా మారాయి. వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది.