ఏపీ టెట్ ఫలితాలు విడుదల...

ఏపీ టెట్ ( టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ) ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం ఐటీ, విద్యా, ఆర్జీటి మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు.డీఎస్సీలో టెట్ మార్కులకు 20శాతం వెయిటేజీ ఉంటుందని తెలిపారు. ఇటీవల బీఈడీ, డీఈడీ పాసైన వారికి త్వరలోనే టెట్ పరీక్షా ఉంటుందని తెలిపారు లోకేష్.ఈసారి టెట్ లో ఫెయిల్ అయినవారికి మరొక అవకాశం ఉంటుందని అన్నారు.

ఇవాళ విడుదల చేసిన ఫలితాల్లో 58.4శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను అధికారిక వెబ్సైట్ https://aptet.apcfss.in/ లాగిన్ అయ్యి చూసుకోవచ్చు.త్వరలోనే 16, 347 పోస్టులకు గాను మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో టెట్ లో అర్హత సాధించిన అభ్యర్థులు డీఎస్సీ సిద్ధం కావాలని అధికారులు తెలిపారు.