ఏపీలో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం చకచకా నిర్ణయాలు తీసుకుంటూ పాలనా పరమైన ప్రక్షాళనకు సిద్ధమైంది. నాలుగవసారి ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు రాజధాని అమరావతిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.ఇప్పటికే పలు శాఖలకు సంబంధించిన అధికారులతో సమీక్షలు నిర్వహించిన చంద్రబాబు అమరావతి, పోలవరంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించాడు. ఈ క్రమంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారాయణ అమరావతిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన నారాయణ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఖరారు చేసిన మాస్టార్ ప్లాన్ ప్రకారమే అమరావతి నగర నిర్మాణం ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. గతంలో దేశ విదేశాలు తిరిగి అమరాతి నమూనాను రూపొందించామని, ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని అన్నారు.రాజధాని కోసం రైతులు 33 వేల ఎకరాలను ఇచ్చారని మంత్రి గుర్తు చేశారు. గత ప్రభుత్వం అమరావతిని నిర్లక్ష్యం చేసిందని, మూడు రాజధానుల పేరిట మూడు ముక్కలాట ఆడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాజధాని అమరావతితో పటు అన్ని జిల్లాలను సమానంగా అభివృద్ధి చేస్తామని అన్నారు మంత్రి నారాయణ.