వైసీపీ మూడు ముక్కలాటతో అమరావతిని నిర్వీర్యం చేసింది: మంత్రి నారాయణ

వైసీపీ మూడు ముక్కలాటతో అమరావతిని నిర్వీర్యం చేసింది: మంత్రి నారాయణ

సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీయే 41వ అధారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 23 కీలక అంశాలకు ఆమోదం తెలిపింది అథారిటీ.రాజధానిలో కీలకమైన భవనాలు,రోడ్లు,వరద నివారణ పనులు చేపట్టేందుకు నిధులు కేటాయిస్తూ పాలనాపరమైన అనుమతులు ఇచ్చింది అధారిటీ. ఈ క్రమంలో వైసీపీని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు మంత్రి నారాయణ.గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాట తో అమరావతిని నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు కమిటీలు వేసి నివేదికల ఆధారంగా ముందుకెళ్తున్నామని.. 11వేల 467 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచెందుకు ఏ సమావేశంలో అధారిటీ నిర్ణయంచిందని తెలిపారు.360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లలో కు రూ. 2వేల 498 కోట్లతో కొన్ని రోడ్లకు పనులు ప్రారంభానికి ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.

ALSO READ : పవన్.. బోట్లు వేసుకొని హడావిడి చేయడం కాదు.. నిజాలు నిగ్గు తేల్చండి: షర్మిల ట్వీట్

రైతులకు ఇచ్చిన రిటర్ణబుల్ లేఅవుట్లలో రోడ్లు,మౌళిక వసతుల కల్పనకు రూ. 3వేల 859 కోట్లకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు నారాయణ. ఆయా పనులకు వెంటనే టెండర్లు పిలిచి జనవరి నుంచి పనులు ప్రారంభిస్తామని అన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ,స్ట్రీట్ లైట్స్,తాగు నీరు,ల్యాండ్ స్పింగ్...ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో చేయాలని సీఎం.5 ఐకానిక్ టవర్లు,అసెంబ్లీ,హై కోర్టు భవనాలు డిజైన్లకు టెండర్లు పిలిచామని డిసెంబర్ నెలాఖరుకు ఐకానిక్ భవనాలు కు టెండర్లు పిలుస్తామని అన్నారు.