వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లా ఘణపురం మండలంలోని గణపసముద్రం రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లో బాధిత రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాకతీయ రాజుల కాలం
నాటి గణపసముద్రం చెరువును రిజర్వాయర్‌గా మార్చి మరో పదివేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. ఘణపురం శివారులో 580 ఎకరాలు, వెంకటాంపల్లి శివారులో 21 ఎకరాలు ముంపునకు గురవుతున్నాయని, రైతులకు మంచి పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. పనులకు సంబంధించి తర్వలోనే టెండర్లు పిలుస్తామన్నారు. సాగుతో పాటు మత్స్యసంపద ద్వారా వేల మందికి ఉపాధి కల్పిస్తామని.. రిజర్వాయర్‌కు రైతులు సహకరించాలని కోరారు.
రైతులను ఇబ్బంది పెట్టొద్దు: కలెక్టర్ ఉదయ్ కుమార్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : బ్యాంకర్లు రైతులను ఇబ్బంది పెట్టొద్దని, టార్గెట్ మేరకు పంట రుణాలు ఇవ్వాలని కలెక్టర్ ఉదయ్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు ఆఫీసులో నాబార్డు డీడీఎం, లీడ్ బ్యాంక్ మేనేజర్, ఇండస్ట్రీస్, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గోడౌన్స్, కోల్డ్ స్టోరేజ్, విత్తన శుద్ధి కేంద్రాల కొరత ఉందని, వీటి ఏర్పాటుకు ఉన్న పథకాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఇండస్ట్రీస్, నాబార్డ్ కింద అమలు చేస్తున్న పథకాల ద్వారా ఎలా లబ్ధిపొందవచ్చో రైతులకు వివరించాలన్నారు. ఈమేరకు అన్ని అంశాలతో కూడిన నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. డీఏవో వెంకటేశ్వర్లు, హార్టికల్చర్ ఆఫీసర్ చంద్రశేఖర్, ఇండస్ట్రీస్ ఆఫీసర్ హనుమంతు నాయక్, నాబార్డు డీడీఎం షణ్ముఖ చారి పాల్గొన్నారు.
గద్వాల డీఎంహెచ్‌వోగా లాలూ ప్రసాద్
గద్వాల, వెలుగు: గద్వాల జిల్లా డీఎంహెచ్‌వోగా హైదరాబాద్‌లోని నీలోపర్ హాస్పిటల్ ఆర్‌ఎంవోగా డాక్టర్ లాలూ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ ఇన్‌చార్జి డీఎంహెచ్‌గా డ్యూటీ చేస్తున్న డాక్టర్ చందూ నాయక్‌ను ఇబ్రహీంపట్నం డిప్యూటీ డీఎంహెచ్‌గా ట్రాన్స్ ఫర్ చేసింది. చందూనాయక్‌పై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఎంక్వైరీకి ఆదేశించిన విషయం తెలిసిందే. కానీ, రిపోర్టు రాకముందే ఆయనను మరో చోటుకు బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
పునరావాస ఏర్పాట్లు స్పీడప్ చేయండి:అడిషనల్ కలెక్టర్ మోతిలాల్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి నిర్వాసితులకు సంబంధించిన ఆర్‌అండ్‌ఆర్ సెంటర్లలో మౌలిక సదుపాయాల కల్పన స్పీడప్ చేయాలని అడిషనల్ కలెక్టర్ మోతిలాల్ ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్‌లో వట్టెం రిజర్వాయర్ పరిధిలోని జీగుంట తండా, అంకన్ పల్లి, అంకన్ పల్లి తండా, కారుకొండ తండా, రాంరెడ్డి తండా నిర్వాసితుల పునరావాసంపై కమిటీ సభ్యులు, ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్వాసితులు ఇప్పటికే తమ పొలాలు వదులుకొన్నారని, ఇళ్లను కూడా వదిలిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వారికి కేటాయించిన ఆర్‌అండ్‌ఆర్ సెంటర్లలో రోడ్లు, విద్యుత్, నీరు, డ్రైనేజీ, స్కూల్, టెంపుల్, పీహెచ్‌సీ లాంటి సౌకర్యాలు త్వరగా కల్పించాలన్నారు. ఇప్పటికే ఇండ్లు నిర్మించుకున్న వారికి నల్లా కనెక్షన్లు ఇవ్వాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ కింద నిర్మిస్తున్న ఓవర్ హెడ్ ట్యాంక్‌ను తర్వగా పూర్తి చేయాలని సూచించారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ గుట్ట పక్కన ప్లాట్లు ఇవ్వడంతో వర్షం పడ్డప్పుడు రాళ్లు, మట్టి కొట్టుకొచ్చి ఇళ్ల నిర్మాణ పనులకు ఆటంకం కలుగుతోందని వాపోయారు. మట్టి, రాళ్లు రాకుండా ప్రహరీ కడతామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. స్పందించిన అడిషనల్ కలెక్టర్ త్వరలోనే పునరావాస కేంద్రాన్ని సందర్శించి.. అవసరమైన పనులకు ఆదేశాలస్తామని చెప్పారు. ఇరిగేషన్ ఈఈ పార్థసారథి, విద్యుత్ ఏడీ అదిశేషయ్య, మిషన్ భగీరథ డీఈ ప్రతాప్, , బిజినేపల్లి తహసీల్దార్ అంజి రెడ్డి, సర్పంచులు రమణి, లక్ష్మీ, కాంట్రాక్టర్లు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
21 మంది బైండోవర్
అయిజ, వెలుగు: కర్ణాటక లిక్కర్ సరఫరా, నాటు సారా తయారీ, డ్రగ్స్ విక్రయం కేసుల్లో అనుమానితులుగా ఉన్న నందిన్నె, సుల్తాన్ పురం, రంగాపురం, మల్లాపురం, ఇర్కిచేడుకు చెందిన 21 మందిని శుక్రవారం కేటిదొడ్డి తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు గద్వాల ఎక్సైజ్ సీఐ గోపాల్ తెలిపారు. మొదటి సారి కావడంతో తహసీల్దార్ వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. మరో సారి పట్టుబడితే రూ. లక్ష ఫైన్‌తో ఏడాది జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిబ్బంది రాజేందర్, బాలయ్య,వేణు,రవి, రాజు పాల్గొన్నారు.
కాల్వలపై పెట్టిన మోటార్లు తొలగించాలి: కలెక్టర్ వల్లూరు క్రాంతి
గద్వాల, వెలుగు: నెట్టెంపాడు లిఫ్ట్ కాల్వలపై రైతులు ఏర్పాటు చేసుకున్న మోటార్లను వెంటనే తొలగించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఇరిగేషన్ ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం మల్దకల్ మండలం 105వ ప్యాకేజీ కింద చేపట్టిన కాల్వలు, తాటికుంట, చిన్నోనిపల్లి రిజర్వాయర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కాలువలపై మోటార్లు పెట్టడంతో మట్టి కరిగిపోయి లీకేజీలు ఏర్పడుతున్నాయని, పలుచోట్ల తెగిపోయే స్థితికి చేరాయన్నారు. అనంతరం నిరసన చేస్తున్న చిన్నోనిపల్లి రిజర్వాయర్ నిర్వాసితుల దగ్గరికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఆర్డీవో రాములు, ఇరిగేషన్ ఎస్‌సీ శ్రీనివాసరావు, ట్రాన్స్‌కో ఎస్‌సీ భాస్కర్, ఈఈ లు రహీముద్దీన్, వెంకటేశ్వర్లు ఉన్నారు.
క్వాలిటీ రైస్ పంపిణీ చేయాలి
రేషన్ షాపులు, అంగన్ వాడీ సెంటర్లకు, స్కూళ్లకు క్వాలిటీ రైస్ పంపిణీ చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో నిర్వహించిన మీటింగ్‌లో ఆమె మాట్లాడుతూ ఆహార భద్రత అనేది ఉత్పత్తిదారులు, వినియోగదారుల మధ్య భాగస్వామ్యం లాంటిదన్నారు. జిల్లాలో 54,858 లబ్ధిదారులకు రేషన్ బియ్యం అందిస్తున్నామని చెప్పారు. ఈ మీటింగ్‌లో డీఎం ప్రసాద్ రావు, జడ్పీ డిప్యూటీ సీఈవో ముసాయిదా బేగం, డీఈవో సిరాజుద్దీన్ ఉన్నారు.
మహనీయుల ఆశయ సాధనకు కృషి చేయాలి
అమనగల్లు, వెలుగు: భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, జాతి విముక్తికి మార్గం చూపిన ఫూలే ఆశయ సాధనకు కృషి చేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆమనగల్లు పట్టణంలో అంబేద్కర్, ఫూలే జ్ఞాన జాతర సభను నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ చిన్న రాష్ట్రాలతోనే అందరికీ ప్రభుత్వ ఫలాలు అందుతాయని అంబేద్కర్ అనాడే గుర్తించారన్నారు. ఆర్టికల్–3 లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అనురాధ, సర్పంచ్ వెంకటేశ్వర్లు గౌడ్, సీఐ ఉపేందర్, నేతలు దాసురాం, సంజీవ్, రాము, జాతర నిర్వాహకులు సుధాకర్, కొమ్ము తిరుపతి, శంకర్ పాల్గొన్నారు.
పౌష్టికాహారంపై అవగాహన కల్పించాలి:కలెక్టర్ ఎస్.వెంకట్ రావు
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: పౌష్టికాహారం ప్రాముఖ్యత, పౌష్టికాహార లోపం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించేందుకు నియోజకవర్గ స్థాయి సమావేశాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఎస్.వెంకట రావు ఆదేశించారు. శుక్రవారం రెవెన్యూ మీటింగ్ హాల్‌లో పౌష్టికాహారం, తొలిమెట్టు కార్యక్రమాలపై ఐసీడీఎస్, విద్యాశాఖ ఆఫీసర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పౌష్టికాహారంపై ఏర్పాటు చేసే సమావేశాలకు ఎమ్మెల్యే తో పాటు ప్రజా ప్రతినిధులు, ఎంపీడీవో, తహసీల్దార్, ఎంఈవో, హెచ్ఎం, స్కూల్స్ టీచర్స్, పంచాయతీ సెక్రటరీలు, అంగన్వాడీ సూపర్ వైజర్స్, ఆశ వర్కర్లను పిలవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల వారీగా బరువు కొలిచే యంత్రాల వివరాలను శుక్రవారం సాయంత్రంలోగా సమర్పించాలని ఆదేశించారు. ఇకపై ప్రతి గురువారం మెడికల్ ఆఫీసర్స్, పంచాయతీ సెక్రటరీ అంగన్‌వాడీ సెంటర్లను తనిఖీ చేసి చిల్ట్రిన్స్ వెయిటేజీ ఇవ్వాలని సూచించారు. ఈ నెలాఖరు నాటికి జీపీ నిధుల నుంచి ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేయాలని డీపీవోను ఆదేశించారు. తొలి మెట్టుపై జరిగిన సమీక్షలో మాట్లాడుతూ వెనకబడిన విద్యార్థులను గుర్తించి సామర్థ్యాలు పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మౌలిక భాష, గణిత సామర్థ్యాల సాధన కింద దీన్ని చేపట్టాలన్నారు. అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా సంక్షేమ ఆఫీసర్ జరీనా బేగం, డీఈవో రవీందర్, డీపీవో వెంకటేశ్వర్లు, డీఎంహెచ్‌వో కృష్ణ, డీఆర్డీవో యాదయ్య పాల్గొన్నారు.
కేతేపల్లి టెంపుల్‌లో చోరీ
పానుగల్, వెలుగు: పానుగల్ మండలంలోని కేతేపల్లి గ్రామంలోని సీతారామాంజనేయస్వామి దేవాలయంలో చోరీ జరిగింది. ఆలయ పూజారి శ్రీకుమార్ చారి, పోలీసుల వివరాల ప్రకారం.. పూజారి ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం పూజ చేసేందుకు గుడి వద్దకు చేరుకోగా తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా స్వామి వారి విగ్రహాన్నికి ఉన్న 100 మాసాల వెండి కిరీటం, సీతాదేవి విగ్రహానికి ఉన్న 3 మాసాల పుస్తె కనిపించలేదు. పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. పూజారి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పౌష్టికాహారంతోనే రక్తహీనత దూరం:కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా
వనపర్తి, వెలుగు: పౌష్టికాహారంతోనే రక్తహీనతను నివారించవచ్చని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా చెప్పారు. శుక్రవారం ప్రపంచ ఆహార దినోత్సవం- సందర్భంగా కలెక్టరేట్ జిల్లా ఆఫీసర్లతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కల్తీలేని ఫుడ్ తీసుకోవడం వల్ల మన పూర్వీకులు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారని గుర్తు చేశారు. సాధ్యమైనంత వరకు జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని, పౌష్టికాహారం తీసుకుంటో రోగాలు దరిచేరవన్నారు. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అంగన్‌వాడీ సెంటర్లు, వెల్ఫేర్ హాస్టళ్లలో క్వాలిటీ ఫుడ్ పెట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా స్టూడెంట్లకు పోటీలు నిర్వహించి.. గెలుపొందిన వారికి డిక్షనరీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ డి.వేణుగోపాల్, డీఆర్డీవో నరసింహులు, సివిల్ సప్లై అధికారి కొండల్ రావు, డీఎంహెచ్ వో డాక్టర్ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
మహనీయుల ఆశయ సాధనకు కృషి చేయాలి
అమనగల్లు, వెలుగు: భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, జాతి విముక్తికి మార్గం చూపిన ఫూలే ఆశయ సాధనకు కృషి చేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆమనగల్లు పట్టణంలో అంబేద్కర్, ఫూలే జ్ఞాన జాతర సభను నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ చిన్న రాష్ట్రాలతోనే అందరికీ ప్రభుత్వ ఫలాలు అందుతాయని అంబేద్కర్ అనాడే గుర్తించారన్నారు. ఆర్టికల్–3 లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అనురాధ, సర్పంచ్ వెంకటేశ్వర్లు గౌడ్, సీఐ ఉపేందర్, నేతలు దాసురాం, సంజీవ్, రాము, జాతర నిర్వాహకులు సుధాకర్, కొమ్ము తిరుపతి, శంకర్ పాల్గొన్నారు.
డాక్టర్ పోస్టులకు అప్లై చేసుకోండి
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న జిల్లా ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో డాక్టర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూపరింటెండెంట్ డాక్టర్ కేఎన్ రమేశ్‌చంద్ర శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఆస్పత్రిలో జనరల్ ఫిజీషియన్, పల్మనాలజిస్ట్, గైనకాలజీ, అనస్తియా పోస్టులతో పాటు కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట , అమ్రాబాద్ ఉప్పునుంతల , లింగాల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రుల్లో ఎంబీబీఎస్ డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ నెల 17,18 తేదీల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లతో అప్లై చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 98667 17232 నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
జాయిన్ అయిన రెండు రోజులకే బదిలీ
గద్వాలలో మున్సిపల్ పాత కమిషనర్‌కే మళ్లీ బాధ్యతలు
గద్వాల, వెలుగు: గద్వాల మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన రెండు రోజులకే బదిలీ కావడం, పాత కమిషనర్‌కే మళ్లీ పోస్టింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే..ఇటీవల జరిగిన మున్సిపల్ మీటింగ్‌లో కౌన్సిలర్లు కమిషనర్ జానకీరామ్ సాగర్‌పై పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన లాంగ్ లీవ్ పెట్టి వెళ్లిపోయారు. సోమవారం నిజామాబాద్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న రవిబాబును గద్వాల మున్సిపల్ కమిషనర్‌గా, జానకీరామ్ సాగర్‌ను అందోల్ మున్సిపల్ కమిషనర్‌తో పాటు మల్కాజిగిరి మెప్మా ఏవోగా అదనపు బాధ్యతలు ఇస్తూ సీడీఎంఏ ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం గద్వాల మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన రవిబాబు.. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని మునుగోడు ప్రచారంలో ఉండడంతో కలవకలేకపోయారు. శుక్రవారం ఎమ్మెల్యే గద్వాలకు వచ్చిన విషయం తెలుసుకున్న రవిబాబు మధ్యాహ్నం సమయంలో బొకే తీసుకొని కలిసేందుకు వెళ్లాడు. ‘ఎవర్ని అడిగి కమిషనర్ గా వచ్చావు.. నీవు అయిజ కమిషనర్‌గా ఉన్నప్పుడు చేసిన వెదవ పనులు మాకు తెలుసు’ అని ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే బొకే తీసుకోకుండానే వెనక్కి పంపించాడు. సాయంత్రంలోగా పాత కమిషనర్ జానకిరామ్ సాగర్‌కే మళ్లీ పోస్టింగ్ ఇవ్వడంతో పాటు రవిబాబును సీడీఏంఏ ఆఫీస్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
స్టూడెంట్ మిస్సింగ్
అలంపూర్, వెలుగు: మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల స్టూడెంట్ అదృశ్యం అయ్యాడు. ఉండవెల్లి ఎస్సై బాలరాజు వివరాల ప్రకారం.. గద్వాల జిల్లా గట్టు మండలం చాగదోని గ్రామానికి చెందిన మల్లేశ్, ఈరమ్మ దంపతుల కొడుకు జగదీశ్ ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలో ఉన్న బీసీ గురుకులంలో 9వ తరగతి చదువుతున్నాడు. దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన జగదీశ్ సెలవులు ముగియడంతో ఈ నెల 12న స్కూల్‌కు వచ్చాడు. శుక్రవారం కనిపించకపోవడంతో ప్రిన్సిపాల్ దామోదర్ రెడ్డి సీసీ కెమెరాలు పరిశీలించగా తెల్లవారుజామున 5 గంటలకు హాస్టల్ భవనం నుంచి కిందికి దిగి వెళ్లినట్లు రికార్డు అయ్యింది. విద్యార్థి తండ్రి మల్లేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
పౌష్టికాహారంతోనే రక్తహీనత దూరం: కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా
వనపర్తి, వెలుగు: పౌష్టికాహారంతోనే రక్తహీనతను నివారించవచ్చని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా చెప్పారు. శుక్రవారం ప్రపంచ ఆహార దినోత్సవం- సందర్భంగా కలెక్టరేట్ జిల్లా ఆఫీసర్లతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కల్తీలేని ఫుడ్ తీసుకోవడం వల్ల మన పూర్వీకులు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారని గుర్తు చేశారు. సాధ్యమైనంత వరకు జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని, పౌష్టికాహారం తీసుకుంటో రోగాలు దరిచేరవన్నారు. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అంగన్‌వాడీ సెంటర్లు, వెల్ఫేర్ హాస్టళ్లలో క్వాలిటీ ఫుడ్ పెట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా స్టూడెంట్లకు పోటీలు నిర్వహించి.. గెలుపొందిన వారికి డిక్షనరీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ డి.వేణుగోపాల్, డీఆర్డీవో నరసింహులు, సివిల్ సప్లై అధికారి కొండల్ రావు, డీఎంహెచ్ వో డాక్టర్ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
భక్తులకు ఇబ్బందులు రానివ్వొద్దు: ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం టెంపుల్ ఆవరణలో బ్రహ్మోత్సవాల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 26 నుంచి ఉత్సవాలు ప్రారంభం అవుతాయని, 30న అలంకారోత్సవం, 31న ఉద్దాలోత్సవం ఉంటుందన్నారు. టెంపుల్‌కు వచ్చే రోడ్లను పరిశీలించి గుంతలు పడ్డ చోట రిపేర్లు చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. తాగునీరు, విద్యుత్ సౌకర్యంతో పాటు పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని లైన్ డిపార్ట్‌మెంట్ అధికారులకు సూచించారు. ఉత్సవాలు జరిగినన్ని రోజులు వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు అంబులెన్స్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జడ్పీటీసీ రాజేశ్వరి, టెంపుల్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ఎండోమెంట్ కమిషనర్ శ్రీనివాసరాజు, విద్యుత్ ఎస్ఈ మూర్తి, డీపీవో వెంకటేశ్వర్లు, డీఆర్డీవో యాదయ్య, డీఎంహెచ్‌వో కృష్ణ పాల్గొన్నారు.