రైతుల జీవితాలతో కాంగ్రెస్  చెలగాటం

రైతుల జీవితాలతో కాంగ్రెస్  చెలగాటం

వనపర్తి, వెలుగు: రైతు బంధు పథకాన్ని నిలిపేయాలని కాంగ్రెస్  పార్టీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడంపై మంత్రి నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల జీవితాలతో ఆటలు వద్దంటూ హెచ్చరించారు. శుక్రవారం వనపర్తిలో తన ఇంట్లో మీడియాతో మాట్లాడారు. రైతులపై కాంగ్రెస్  పార్టీ కి ఎలాంటి ప్రేమ, బాధ్యత లేదని విమర్శించారు. వరి పంటలు కోతకు వచ్చాయని, వడ్లను ఎవరు కొనాలని ప్రశ్నించారు.

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా అడ్డుకుంటారా? అని ఆయన నిలదీశారు. అడ్డు పుల్లలు వేసి లబ్ధి పొందాలనుకోవడం కాంగ్రెస్  నీచ రాజకీయాలకు పరాకాష్టగా పేర్కొన్నారు. రైతుబంధు కొత్తగా ఇస్తున్నది కాదన్నారు. రైతుబంధు వద్దని కాంగ్రెస్  పార్టీ రాసిన లేఖను రాష్ట్రంలోని రైతులు అర్థం చేసుకోవాలన్నారు. నాగం తిరుపతి రెడ్డి, హైకోర్టు అడ్వకేట్ రాధ, పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, పురుషోత్తం రెడ్డి, కౌన్సిలర్లు కంచె రవి, పుట్టపాకుల మహేశ్, నాగన్న యాదవ్  పాల్గొన్నారు.

‘రైతుబంధుపై కాంగ్రెస్  ఫిర్యాదు చేసింది’

మహబూబ్ నగర్ రూరల్: రైతుబంధు ఆపాలని కాంగ్రెస్  ఈసీకి ఫిర్యాదు చేసిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్  పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రూరల్  మండలం పోతన్ పల్లి, మాచన్ పల్లి, రామచంద్రపురం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్  పార్టీకి ఓటేస్తే కర్నాటక పరిస్థితి వస్తుందనే విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. లైబ్రరీ చైర్మన్  రాజేశ్వర్ గౌడ్, శాంతయ్య యాదవ్, మల్లు నరసింహారెడ్డి, ఎంపీపీ సుధాశ్రీ, జడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ పాల్గొన్నారు.