మినరల్‌‌‌‌‌‌‌‌ ఫండ్‌‌‌‌‌‌‌‌ను ఆ ప్రాంతాలకే వాడాలి

మినరల్‌‌‌‌‌‌‌‌ ఫండ్‌‌‌‌‌‌‌‌ను ఆ ప్రాంతాలకే వాడాలి
  • ఆగస్టు నాటికి జిల్లా ఖజానాలో 38.98 కోట్లు జమ
  • ఈ నిధులతో బాధిత ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి 
  • వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి 

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: జిల్లాకు వచ్చే మినరల్‌‌‌‌‌‌‌‌ ఫండ్‌‌‌‌‌‌‌‌ను మైనింగ్‌‌‌‌‌‌‌‌ ఏరియాల అభివృద్ధికే వాడాలని జిల్లా ఖనిజ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. శనివారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్ మీటింగ్ హాల్‌‌‌‌‌‌‌‌లో కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఖనిజ ఫౌండేషన్ ట్రస్ట్ మీటింగ్‌‌‌‌‌‌‌‌కు ఎంపీ రాములుతో కలిసి చీఫ్‌‌‌‌‌‌‌‌ గెస్ట్‌‌‌‌‌‌‌‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ట్రస్ట్ సమావేశం ఎప్పుడో నిర్వహించాల్సిందని, కొవిడ్ కారణంగా కుదరలేదని చెప్పారు. ఆగస్టు 31 వరకు జిల్లా ఖజానాలో రూ. 38.98 కోట్ల మినరల్ ఫండ్  జమ అయ్యిందని తెలిపారు.  ఈ నిధుల నుంచి రూల్స్‌‌‌‌‌‌‌‌ మేరకు 5 శాతం అంటే రూ. 1.94 కోట్లు అత్యవసర పరిస్థితుల కోసం జాతీయ బ్యాంకులో,  మరో 5 శాతం పరిపాలన, డైరెక్టర్ మైన్స్ ఖాతాలో జమ చేశామన్నారు. అంబూడ్స్‌‌‌‌‌‌‌‌మెన్, ఇతర అవసరాలకు 5 శాతం కేటాయించినట్లు తెలిపారు. మిగిలిన 85 శాతం నిధులను మైన్స్ ద్వారా నష్టపోయిన ప్రాంతాల అభివృద్ధికి ఖర్చు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. 

రూ.2.81 కోట్ల పనులకు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్
మినరల్‌‌‌‌‌‌‌‌ ఫండ్‌‌‌‌‌‌‌‌లో 15 శాతం పోనూ మిగిలిన 33.14 కోట్ల నిధులను ఎమ్మెల్యేలు, ఎంపీ సిఫార్సు మేరకు మైనింగ్‌‌‌‌‌‌‌‌ ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌ ఏరియాల్లో ఖర్చు చేయనున్నామన్నారు. ఇప్పటికే రూ. 23.81 కోట్ల పనులకు సబంధించి పరిపాలన అనుమతులు జారీ చేశామని,  పనులు ప్రోగ్రెస్‌‌‌‌‌‌‌‌లో ఉన్నట్లు వెల్లడించారు. ఇందులో ఎంపీ రూ. 3.50 కోట్లు, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రూ. 5.56 కోట్లు, కల్వకుర్తి ఎమ్మెల్యే రూ. 2.62 కోట్లు, కొల్లాపూర్ ఎమ్మెల్యే 3.49 కోట్ల పనులను సిఫార్సుచేశారని వివరించారు. మిగిలిన రూ. 9.33 కోట్లకు సంబంధించిన పనులకు కమిటీలో ఆమోదం పొందిన తర్వాత పరిపాలన ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చే అభివృద్ధి పనులను గుర్తించి ప్రతిపాదనలు పంపాల్సిందిగా ఎమ్మెల్యేలకు సూచించారు. మన ఊరు–మనబడిపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ పనులు ఏ దశలో ఉన్నాయి..? పెండింగ్ కు గల కారణాలు ఏమిటి?  అనే విషయాలను అధికారులు సంబంధిత ఎమ్మెల్యే దృష్టికి తేవాలని సూచించారు. ఈ అంశంపై ఒక రోజు ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తామని, అన్ని వివరాలతో సిద్ధంగా ఉండాలన్నారు.

మనబడి పనులు మెల్లగా సాగుతున్నయ్
ఎంపీ రాములు మాట్లాడుతూ మన ఊరు–మనబడి పనులు నెమ్మదిగా సాగతున్నాయని, కల్వకుర్తి నియోజకవర్గం గుండూరులో ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వర్షాలతో తరగతుల నిర్వహణకు ఇబ్బందులు కలుగుతున్నాయని, వెంటనే పనులు ప్రారంభించేలా చూడాలని కోరారు. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ మన ఊరు–మనబడి పనుల పురోగతి, సమస్యలపై అధికారులు ఎమ్మెల్యేలతో చర్చించకపోవడంతో పనుల్లో జాప్యం జరుగుతోందన్నారు. అంతకుముందు తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా సమావేశం నివాళి అర్పిస్తూ తీర్మానం చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ పాత్ర కీలకమని, భూమి కోసం, భుక్తి కోసం..వెట్టిచారికి విముక్తి కోసం పోరాటం చేశారని కొనియాడారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజ్, జడ్పీ చైర్ పర్సన్ పద్మావతి, కొల్లాపూర్ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీవో నర్సింగ్ రావు, జిల్లా వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు పాల్గొన్నారు.  

అర్హులందరికీ పింఛన్లు ఇస్తం 
గోపాల్ పేట, వెలుగు:  అర్హత ఉండి పింఛన్ రాని వారు అధైర్య పడొద్దని, అప్లై చేసుకుంటే పరిశీలించి పింఛన్లు ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. శనివారం వనపర్తి జిల్లా గోపాల్ పేట మండల కేంద్రంలోని పద్మావతి గార్డెన్ లో 1331 మంది లబ్ధిదారులకు పింఛన్ల ప్రోసిడింగ్ కాపీలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా కారణంగా కొత్త పింఛన్ల పంపిణీ ఆలస్యమైందన్నారు. పింఛన్లు ఎప్పుడిస్తారని విమర్శించిన వాళ్లు ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారని విమర్శించారు. గత ప్రభుత్వాలు చావడానికి పింఛన్లు ఇస్తే టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం బతికేందుకు ఇస్తున్నామని చెప్పారు. జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, ఎంపీపీ సంద్య యాదవ్, జడ్పీటీసీ భార్గవి ఉన్నారు.