పల్లెనిద్రతో సమస్యల పరిష్కారం : వాసంతి

పల్లెనిద్రతో సమస్యల పరిష్కారం : వాసంతి

పెబ్బేరు, వెలుగు: పల్లె నిద్రతోనే గ్రామాల్లో అధిక సమస్యలు పరిష్కారమయ్యాయని మంత్రి నిరంజన్​ రెడ్డి సతీమణి వాసంతి తెలిపారు.  పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా మంత్రి సతీమణి గురువారం రాత్రి  మండలంలోని సూగూరు గ్రామంలో పర్యటించారు. గ్రామంలో ఇంటింటికీ తిరిగి సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పల్లెనిద్ర రాష్ట్రంలోనే వినూత్న కార్యక్రమం అని అన్నారు.

100కు పైగా గ్రామాల్లో పల్లె నిద్ర చేసిన ఏకైక నాయకుడు మంత్రి నిరంజన్​ రెడ్డి అని పేర్కొన్నారు. మంత్రి నిరంజన్​ రెడ్డి చొరవతోనే తొమ్మిదేళ్లలో వనపర్తి జిల్లాకు మెడికల్, ఇంజనీరింగ్, వ్యవసాయ, మత్స్య కళాశాలలు వచ్చాయని గుర్తు చేశారు. లక్ష ఎకరాలకు సాగునీరు, రహదారులు నిర్మాణం వేగంగా జరిగిందన్నారు. 60 ఏళ్లలో జరగని అభివృద్ది 9 ఏళ్లలో చేసి చూపించారని చెప్పారు. సీఎం కేసీఆర్ సహకారంతో వనపర్తిని అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపారని  ఆమె పేర్కొన్నారు. 

ALSO READ: ఎన్నికల నియమావళిని తప్పక పాటించాలి : కలెక్టర్ ఎస్. వెంకట్రావు