కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశ పెట్టారు. అయితే ఈ సారి బడ్జెట్ ప్రసంగాన్ని చాలా తొందరగా ముగించారు మంత్రి. 2025-26 బడ్జెట్ ప్రసంగం కేవలం 1 గంట 25 నిమిషాలే ఉండటం గమనార్హం.
ప్రతిపక్ష సభ్యుల ఆందోళనల మధ్య కేంద్ర మంత్రి బడ్జెట్ ప్రసంగాన్ని చదివి వినిపించారు. ప్రయాగ్ రాజ్ తొక్కిసలాట గురించి చర్చించాలని బడ్జెట్ ప్రారంభం నుంచి విపక్షాలు పట్టుబట్టాయి. అయితే మంత్రి ఆందోళనలను పట్టించుకోకుండా బడ్జెట్ ముగించారు.