తెలంగాణ మంత్రిగా కొండా సురేఖ ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రమాణం చేయించారు.
కొండా సురేఖ 1965 ఆగస్టు 19న జన్మించారు. 1995లో మండల పరిషత్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 1999, 2004 ఎన్నికల్లో శాయంపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో పరకాల నుంచి గెలుపు, వైఎస్ కేబినెట్ లో మంత్రిగా పని చేశారు. 2011లో కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. 2014లో బీఆర్ఎస్ తరపున వరంగల్ తూర్పు నుంచి గెలుపొందారు. 2018లో మరోసారి కాంగ్రెస్ లో చేరారు. 2023లో వరంగల్ తూర్పు నుంచి విజయం సాధించారు.