మంత్రిగా ప్రమాణం చేసిన పొన్నం ప్రభాకర్

మంత్రిగా ప్రమాణం చేసిన పొన్నం ప్రభాకర్

తెలంగాణ మంత్రిగా పొన్నం ప్రభాకర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ప్రమాణం చేయించారు. 

పొన్నం ప్రభాకర్ 1967 మే 8న పుట్టారు. విద్యార్థినేతగా రాజకీయ ప్రవేశం చేశారు. 1987- 91 వరకు NSUI జిల్లా కార్యదర్శిగా పని చేశారు. 1999- 2002 వరకు NSUI రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. 2002-2003 మధ్య యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా వర్క్ చేశారు. 2009లో కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందారు. 2014లో కరీంనగర్ ఎంపీ స్థానంలో ఓటమి పాలయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఓడిపోయారు. 2023లో హుస్నాబాద్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.