- ఆస్పత్రిలో వైద్యుల కొరత లేదు
- కాంట్రాక్ట్ పద్ధతిన డాక్టర్లను తీసుకుంటున్నం
- నేను దొరను కాదు.. ఈ ఆస్పత్రిలో పుట్టిన దళిత బిడ్డను
- వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర
హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో వారం రోజుల్లోనే ఐవీఎఫ్ కేంద్రాన్ని ప్రారంభిస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా చెప్పారు. ఇవాళ గాంధీ దవా ఖానను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. బెడ్, ఓపీ వివరాలను పరిశీలించారు. మంకీ ఫాక్స్ వార్డుల ప్రిపరేషన్ పై ఆరా తీశారు. డెంగీ కేసుల పురోగతిని పరిశీలించారు.
మందుల కొరతపై ఆరారరర తీశారు. గాంధీ ఆస్పత్రిలో అటెండెంట్లు నేలపై కూర్చోవడం వల్ల బయటికి తప్పుడు సమాచారం వెళుతుందని, సరిపడా కుర్చీలు సమకూర్చాలని అధికారులకు సూచించారు. ఆస్పత్రిలోని అన్ని వార్డులను మంత్రి తనిఖీ చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ...‘ నేను గాంధీలో పుట్టా. దళిత బిడ్డను. గాంధీ, ఉస్మానియా దవాఖానలకు వచ్చే రోగులు అంతా నా అక్క చెల్లెళ్ళలాగా.. దొరను కాదు, నా వాళ్ళను సరిగా చూసుకోవడం నా బాధ్యత. ప్రతిపక్ష నాయకులు దొరల్లా మాట్లాడ్తున్నారు. ఎక్కువ కాలం ఒకేచోట తిష్ట వేసిన వాళ్ళని బదిలీ చేశాం. ఆసుపత్రుల్లో వైద్యుల కొరత ఉంది అనటం సరికాదు. కాంట్రాక్ట్ పద్ధతుల్లోను వైద్యులను తీసుకుంటున్నాం.