మాయ మాటలతోనే KCR రెండుసార్లు సీఎం అయ్యిండు: మంత్రి పొంగులేటి

మాయ మాటలతోనే KCR రెండుసార్లు సీఎం అయ్యిండు: మంత్రి పొంగులేటి

నిర్మల్: ఇందిరమ్మ సర్కార్ ఒక్కసారి మాట ఇస్తే మడమ తిప్పదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా ఎన్నికలప్పుడే ఇదిగో డబుల్ బెడ్రూం, ఉద్యోగాలు, పెన్షన్లు అని మాయమాటలు చెప్పమని ఎద్దేవా చేశారు. 2024, నవంబర్ 15న మంత్రి పొంగులేటి నిర్మల్ జిల్లాలోని భైంసాలో పర్యటించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మాయ మాటలు చెప్పి కేసీఆర్ రెండు సార్లు సీఎం అయ్యాడని ఆరోపించారు. బీఆర్ఎస్ పది సంవత్సరాల పాలనలో కొత్తరేషన్ కార్డులు, కొత్త ఆసరా పెన్షన్లు ఇవ్వలేదని.. ఎక్కడో ఉప ఎన్నికలు వస్తే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొన్ని ఆసరా పెన్షన్‎లు ఇచ్చారని అన్నారు.

Also Read :- పట్నం నరేందర్ రెడ్డికి స్పెషల్ బ్యారక్ కోరుతూ పిటిషన్

బీఆర్ఎస్ కొత్త రెవెన్యూ చట్టం, ధరణి తీసుకొచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని.. పేదల భూములు లాక్కున్నారని.. విదేశాల్లో ఉండే సంస్థకు రాష్ట్రంలోని భూముల క్రయవిక్రయాలను అప్పగించారని మండిపడ్డారు. కేసీఆర్ తన కేబినెట్‎లోని ఏ మంత్రి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా రాష్ట్ర ప్రజలను ఇరకాటంలోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పులంటిన్ని సరిదిద్దుకొంటూ కాంగ్రెస్ సర్కార్ ముందుకు సాగుతోందని తెలిపారు. 

రైతుల రాజును చేయడమే లక్ష్యంగా గిట్టు బాటు ధరలతో పాటు, ఇందిరమ్మ ఇల్లు, పదేళ్లుగా మూలకుపడిన ఇరిగేషన్ ప్రాజెక్టులను పున:ప్రారంభించామని తెలిపారు. మా ప్రభుత్వం ప్రతిపక్షాల అభిప్రాయాలను తీసుకొని అన్ని సమస్యలను తీర్చుకుంటు ముందుకు పోతుందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వేకు అందరూ సహకరించాలని.. ఈ సర్వే ద్వారా కుటుంబానికి అన్ని అవసరాలను ప్రభుత్వం తీరుస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి స్మార్ట్ కార్డులు అందజేస్తామని తెలిపారు.