ఏపీ బడ్జెట్: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉంది.. మంత్రి పయ్యావుల కేశవ్

ఏపీ బడ్జెట్: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉంది.. మంత్రి పయ్యావుల కేశవ్

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాల మొదటిరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ తొలి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు పయ్యావుల. ఈ క్రమంలో బడ్జెట్ ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు పయ్యావుల. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉందని.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సిన అవసరం ఉందని అన్నారు. గత ప్రభుత్వ పాలనను ప్రజలు పాతరేశారని.. కూటమి ప్రభుత్వం 93 శాతం ప్రజల ఆమోదాన్ని పొందగలిగిందని అన్నారు.

సమాచార విప్లవాన్ని వినియోగించుకోవాలని, శాశ్వత రాజధాని లేకుండా రాష్ట్ర విభజన జరిగిందని అన్నారు. రాష్ట్రాన్ని పునర్మిర్మాణ దిశగా నడిపించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుందని అన్నారు పయ్యావుల కేశవ్. గత ప్రభుత్వం నీటి పారుదల రంగాన్ని పూర్తిగా విస్మరించిందని, పోలవరం నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్పాదక మూలధనాన్ని గత ప్రభుత్వం నిలిపివేసిందని.. తద్వారా ఉత్పత్తి తగ్గిపోయి అభివృద్ధికి ఆటంకం కలిగిందని అన్నారు పయ్యావుల.

కొంతమంది లాభం కోసమే గత ప్రభుత్వ పాలన సాగిందని.. వ్యక్తిగత అవసరాల కోసమే పాలసీలు చేశారని అన్నారు. గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగిందని అన్నారు. 2019 నుండి 2024 వరకు రాష్ట్రంలో చీకటి పాలన సాగిందని అన్నారు. 
 

ఏపీ బడ్జెట్ లోని కీలక అంశాలు ఇవే: 

  • మొత్తం బడ్జెట్: రూ. 2లక్షల 94 వేల 427.25 కోట్లు 
  • రెవిన్యూ వ్యయం 2,35,916.99 కోట్లు
  • మూలధన వ్యయం 32712.84 కోట్లు
  • రెవిన్యూ లోటు 34,742.38 కోట్లు
  • ద్రవ్యలోటు 68742.65 కోట్లు
  • రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34లక్షల కోట్లు..
  •  ద్రవ్యలోటు రూ.68,743 కోట్లు
  •   రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లు..
  •  పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి రూ. 16.739 కోట్లు
  •  జలవనరులు రూ.16,705 కోట్లు.. 
  • ఉన్నత విద్య రూ.2326 కోట్లు.. 
  • పట్టణాభివృద్ధి రూ.11490 కోట్లు.. 
  • పరిశ్రమలు, వాణిజ్యం రూ.3,127 కోట్లు.. 
  • ఇంధన రంగం రూ.8,207 కోట్లు..
  •  పోలీస్ శాఖ రూ. 8495 కోట్లు.. 
  • బీసీ సంక్షేమం రూ.3,907 కోట్లు.. 
  • మైనారిటీ సంక్షేమం రూ.4,376 కోట్లు.. 
  • ఎస్టీ సంక్షేమం రూ.7,557 కోట్లు.. 
  • అటవీ పర్యావరణ శాఖ రూ.687 కోట్లు.. 
  • గృహ నిర్మాణం రూ. 4,012 కోట్లు.. 
  • నైపుణ్యాభివృద్ధి శాఖ రూ.1,215 కోట్లు.
  • దీపం పథకానికి రూ.895 కోట్లు.. 
  • దీపం పథకం ద్వారా 5 లక్షల మందికి లబ్ధి.. 
  • వచ్చే మూడేళ్లలో 18 వేల మంది అధ్యాపకులకు శిక్షణాభివృద్ధి.. 
  • పాఠశాల విద్యాశాఖకు రూ.29,909 కోట్లు.. 
  • ఉపాధ్యాయులపై యాప్ భారం తగ్గింపు..  
  • 192 నైపుణ్య కేంద్రాలు, కళాశాలల ఏర్పాటు.. 
  • విదేశీ ఉపాధి అవకాశాలు పెంచడమే స్కిల్ ఇంటర్నేషనల్ లక్ష్యం.