
వరంగల్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి కొండా సురేఖతో కలిసి పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. వరంగల్ బస్ స్టాండ్ , ఏస్ ఎన్ ఎం.జంక్షన్ లో బల్దియా స్మార్ట్ సిటీ నిధులు రూ.60 లక్షల వ్యయం తో నిర్మించిన జంక్షన్ అభివృద్ది పనులను న మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య , నగర మేయర్ గుండు సుధారాణి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వర్దన్న పేట ఎమ్మెల్యే కే. ఆర్ నాగరాజు జిల్లా కలెక్టర్ డా సత్య శారద, కమీషనర్ డా అశ్విని తానాజీ వాకడే పలువురు పాల్గొన్నారు.