ధరణి వద్దని ఓటుతో ప్రజలు తీర్పు చెప్పారు: మంత్రి పొంగులేటి

ధరణి వద్దని ఓటుతో ప్రజలు తీర్పు చెప్పారు: మంత్రి పొంగులేటి

తెలంగాణ అసెంబ్లీలో భూభారతిపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది.. ధరణిలో వివరాల ఆధారంగానే ఇప్పటికీ పథకాలు అమలు చేస్తున్నారని.. ఇది భూభారతి కాదు భూహారతి అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఈ క్రమంలో పల్లా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ధరణి వద్దని ఓటుతో ప్రజలు తీర్పునిచ్చారని అన్నారు. అన్ని వర్గాలతో చర్చించాకే భూభారతి తెచ్చామని అన్నారు పొంగులేటి.

భూభారతి కాన్సెప్ట్ తో ఈసారి ఎన్నికలకు వెళ్తామని.. ధరణి కాన్సెప్ట్ తో బీఆర్ఎస్ నేతలు ఎన్నికలకు రాగలరా అంటూ సవాల్ విసిరారు పొంగులేటి. ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తారో చూద్దామని అన్నారు. బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. వీఆర్ఏ  వ్యవస్థను మళ్ళీ తీసుకొస్తామని.. వీఆర్ఏలు కావాలని ప్రజలు అడుగుతున్నారని అన్నారు.బీఆర్ఎస్ నేతలు కట్టు కథలు చెబుతున్నారని మండిపడ్డారు పొంగులేటి.