
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. గురువారం (మార్చి6) నిర్వహించిన ఈ సమావేశం దాదాపు ఆరు గంటలపాటు సాగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మార్చి 12 నుంచి 27 వరకు బడ్జెట్, అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ లో నిర్ణయించారు. దీంతో పాటు అభివృద్ధికార్యక్రమాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ వివరించారు.
నాగార్జున సాగర్ శ్రీశైలం రహదారి ప్రాంతాన్ని 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ తీర్చిదిద్దాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ఫ్యూచర్ సిటీ కోసం కొత్త బోర్డు ఏర్పాటు, 90 పోస్టులు మంజూరు కు కేబినెట్ ఆమోదం తెలిపింది.
Also Read :- 10వేల 950 విలేజ్ లెవల్ అఫీసర్ పోస్టులకు కేబినెట్ ఆమోదం
కృష్ణా, గోదావరి నదీ జలాల అంశంపై ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్సీ వర్గీకరణపై చట్టం ,సుప్రీం తీర్పు రాగానే అమలు, ఉగాది నుంచి భూభారతి అమలు, యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి బోర్డు ఏర్పాటు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రులు చెప్పారు.
రాష్ట్రంలో కొత్తగా 10వేల 950 విలేజ్ లెవెల్ ఆఫీసర్ పోస్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తరెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలకు 217 పోస్టులు మంజూరు చేసింది. 10 జిల్లాల కోర్టులకు 55 పోస్టులు మంజూరుకు ఆమోదం తెలుపుతూ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.