నందనవనం ఇండ్లను ఆక్రమించినోళ్లు ఖాళీ చేయాలి:మంత్రి పొంగులేటి

నందనవనం ఇండ్లను ఆక్రమించినోళ్లు ఖాళీ చేయాలి:మంత్రి పొంగులేటి
  • అర్హులకు ఇండ్లు ఇచ్చి న్యాయం చేయండి
  • అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ఎల్బీనగర్ నియోజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్గం ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిధి నంద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ఇండ్లను ఆక్రమించుకున్నవారిని త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్షణం ఖాళీ చేయించి, అర్హులైన వారికి కేటాయించాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. 

బుధ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వారం సెక్రటేరియెట్ లో మంత్రి నిర్వహించిన సమావేశంలో నందనవనంతోపాటు మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హేశ్వరం నియోజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్గం మంకాల్ లోని ఇండ్ల స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్య, కేటాయింపుపై హౌసింగ్ సెక్రట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రీ జ్యోతి బుద్ధప్రకాశ్, ప్రజావాణి నోడ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్ ఆఫీస‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ డి.దివ్య, రంగారెడ్డి క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెక్టర్ నారాయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తంలో రంగారెడ్డి జిల్లా క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెక్టర్లుగా ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నిచేసిన ఎస్.హ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రీశ్, కె.శశాంక్  త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దిత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రులు పాల్గొన్నారు.

ఈ సంద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అక్రమంగా ప్రభుత్వ ఇండ్లను ఆక్రమించుకున్నవారి ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్ల క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఠినంగా వ్యవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రించాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని, ఎలాంటి రాజకీయ ఒత్తిడుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లొగ్గవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ద్దని అధికారుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సూచించారు. నంద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నంలో జేఎన్ యూఆర్ఎం ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌థకం కింద ప్రభుత్వం నిర్మించిన ఇండ్ల కోసం 2019లో ద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఖాస్తు చేసుకుని, ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్ధిదారుని వాటా చెల్లించిన వారి ఇండ్లను కొంత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మంది అక్రమంగా ఆక్రమించుకోవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డంపై మంత్రి తీవ్రంగా స్పందించారు. 

బాధితుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు న్యాయం చేయాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని, ఆక్రమణదారుల నుంచి ఇండ్లు స్వాధీనం చేసుకొని, అర్హులకు కేటాయించాలని అధికారుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆదేశించారు. అలాగే మంకాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్మించిన డ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపులో న్యాయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మైన స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్యల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వెంటనే పరిష్కరించి, అర్హులకు ఇండ్లను కేటాయించాలన్నారు. ఈ రెండింటిపై పూర్తి స్థాయి నివేదిక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందించాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని, వీలైనంత త్వరగా సమస్యలను ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిష్కరించాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని చెప్పారు. 

ప్రభుత్వం నిర్మించి ఇచ్చే ఇండ్లకు సంబంధించి వచ్చే ఫిర్యాదులను సెక్రటేరియెట్ లోని తన ఆఫీస్ కు పంపాలని నోడల్ ఆఫీసర్ ను మంత్రి ఆదేశించారు. వాటి పరిష్కార బాధ్యతలను ప్రత్యేక అధికారికి అప్పగిస్తానని తెలిపారు.