
- మంత్రి పొంగులేటి ఆదేశం
హైదరాబాద్, వెలుగు: గ్రామ సభల్లో ఇందిరమ్మ ఇండ్ల కోసం ఈ ఏడాది జనవరి మూడో వారంలో వచ్చిన అప్లికేషన్లను పరిశీలించి.. లబ్ధిదారులను వెంటనే ఎంపిక చేయాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. రెండో దశ లబ్ధిదారుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సోమవారం సెక్రటేరియెట్ లో హౌసింగ్ స్పెషల్ సెక్రటరీ జ్యోతి బుద్ధ ప్రకాశ్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్‌తో రివ్యూ చేపట్టారు.
జనవరి 26న మోడల్ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేసిన 562 గ్రామాల్లో పబ్లిక్ నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఇండ్ల వర్క్ స్టార్ట్ చేసినా అనర్హులని తేలితే వాటిని రద్దు చేస్తామని హెచ్చరించారు.