వరంగల్ నగర అభివృద్దిపై ప్రత్యేక దృష్టి పెట్టింది సర్కార్. ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు వరంగల్ జిల్లా ఇన్-ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలన్నారు. వరంగల్ నగర అభివృద్ధిపై అధికారులతో సమీక్షించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇటీవల సీఎం రేవంత్ వరంగల్ జిల్లా పర్యటనలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొన్ని హామీలు ఇచ్చారన్నారు.
ప్రభుత్వ ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుని నగర అభివృద్ధి పనులను యుద్ధ ప్రతిపాదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి. వరంగల్ నగర అభివృద్ధిపై సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి,అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి.
ALSO READ | కేయూలో పరిశోధనలకు తాళం.. 9 నెలలుగా తెరుచుకోని కే హబ్
ఈ సమావేశంలో వరంగల్ నగర అభివృద్ధి, ఐఆర్ఆర్, ఓఆర్ఆర్, భద్రకాళి చెరువు, విమానాశ్రయం తదితర అంశాలపై అధికారులతో ప్రధానంగా చర్చించారు మంత్రులు. వరంగల్ నగరంలో నిర్మించే రింగ్ రోడ్డు జాతీయ రహదారులకు కనెక్టివిటీ ఉండేలా చూడాలన్నారు. ఈ ప్రాజెక్టుకు భూసేకరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సూచించారు మంత్రి.
ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణను యుద్ధ ప్రాతిపదికన భద్రకాళి చెరువు శుద్దీకరణపనులను వేగవంతంగా చేపట్టాలని ఆదేశించారు. ప్రాధాన్యత క్రమంలో పనులను చేపట్టి పూర్తిచేయాలని అధికారులకు సూచించారు మంత్రి.