‘దమ్ముంటే నిరూపించండి’.. కేటీఆర్‎కు మంత్రి పొంగులేటి సవాల్

‘దమ్ముంటే నిరూపించండి’.. కేటీఆర్‎కు మంత్రి పొంగులేటి సవాల్

వెలుగు, హైదరాబాద్: బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో  ఫామ్ హౌస్ నిర్మించారంటూ బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు చేస్తోన్న ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. దమ్ముంటే కేటీఆర్, హరీష్ రావులు నా ఇల్లు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్నట్లు నిరూపించాలని ఇద్దరికి సవాల్ విసిరారు. అంతేకాకుండా.. టేప్ పెట్టి కొలిచి నా ఇంటికి సంబంధించిన ఒక్క ఇటుక బఫర్ జోన్‎లో ఉన్న  వెంటనే కూల గొట్టాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్‎కు చెప్తున్నానని అన్నారు.  బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నట్లుగా అది తన ఇళ్లు కాదని.. అది నాకొడుకు పేరు మీద ఉందన్నారు. నేను ధైర్యంగా చెప్తున్నాని.. కేటీఆర్‎లా ఆ ఫామ్ హౌస్ నాది కాదని చెప్పట్లేదని సెటైర్ వేశారు.  కేటీఆర్ తొత్తులు, బీఆర్ఎస్ మాజీలు నా మీద బురద జల్లాలని చూస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ALSO READ | హైడ్రాకు జనం మద్దతు

సామాన్యులు ఇబ్బందులకు గురి కావవద్దనే సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. బఫర్ జోన్‎, ఎఫ్టీఎల్ ఉన్న అక్రమ కట్టడాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. హైడ్రా ద్వారా ప్రజల సొమ్ము, పేదోడి సొమ్ము తిరిగి  వాళ్లకే ఇవ్వాలని మా ప్రభుత్వం చూస్తుందని.. హైడ్రా ఏర్పాటుపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఇక.. గురువారం మహిళ జర్నలిస్ట్ పై జరిగిన దాడి దురదుష్టకరమని.. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి, తాను చింతిస్తున్నామన్నారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి విచారణకు అదేశించారని చెప్పారు. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భవిషత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్త తీసుకుంటామన్నారు.