కేటీఆర్ వ్యాఖ్యలపై పరువునష్టం దావా వేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అమృత్ పథకంలో రూ.8,888 కోట్లకు టెండర్లు పిలిచినట్లు కేటీఆర్ నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు పొంగులేటి..ఒక వేళ కేటీఆర్ తన ఆరోపణలను నిరూపించకపోతే రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. తన సవాల్ ను కేటీఆర్ స్వీకరిస్తే సెప్టెంబర్ 22న ఉదయం ఎక్కడికైనా వస్తానన్నారు. స్పీకర్ ఫార్మాట్లో ఇద్దరం రాజీనామా చేద్దాం అంటూ కేటీఆర్ కు సవాల్ విసిరారు పొంగులేటి.
ALSO READ | చాలా రోజుల తర్వాత ఒకే వేదికపై కేటీఆర్, కోదండరాం
టెండర్లను గత సర్కారే 3,616 కోట్ల చొప్పున 3 ప్యాకేజీలు పిలిచిందన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. పోలింగ్ తేదీకి ఒక్కరోజు ముందే టెండర్లను కట్టబెట్టిందన్నారు . టెండర్లలో సోదా కంపెనీ సృజన్ రెడ్డి ఒక్కటి టెండర్ దక్కించుకున్నారని చెప్పారు పొంగులేటి. టెండర్లు వేయొద్దని ఏ కంపెనీని బెదిరించలేదన్నారు. తామే పిలిచిన రీ టెండర్లలో గతంలో కంటే 54 కోట్లు తక్కువకే బిడ్స్ వచ్చాయన్నారు. ప్రతిపక్ష హోదా అయినా ఉండాలంటే ఆధారాలతో మాట్లాడాలన్నారు. మిషన్ భగీరథలో 39 వేల కోట్ల ప్రజాధనం దోచుకున్నారని ఆరోపించారు పొంగులేటి.