కొత్త రేషన్ కార్డుల జారీ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి. జనవరి 26 నుంచి పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని అన్నారు. గడచిన పదేళ్లలో ఆశించిన స్థాయిలో అభివృధ్ధి జరగలేదని..అభివృద్ధి జరగాలంటే ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యం అని ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు.
గత ప్రభుత్వం పీకల వరకు అప్పులు పెట్టిపోయినప్పటికీ జనవరి 26న రైతు భరోసా కూడా ఎకరాకు 15 వేలు ఇవ్వబోతున్నామని అన్నారు పొంగులేటి. భూమి లేని ప్రతి నిరుపేద కుటుంబానికి రెండు విడుతలుగా 12 వేలు కూడా ఆరోజే ఇవ్వాబోతున్నామని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో నియమాలు పాటించకుండా కొండలకు,గుట్టలకు రైతుబందు ఇచ్చారని అన్నారు. కడుబీదవారికి మొదటి ప్రాధాన్యత గా ఇల్లు ఇవ్వాలని నిర్ణయించామని అన్నారు పొంగులేటి.