హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పులున్నాయని చెప్పిందని.. కానీ మేం అధికారంలోకి వచ్చాక లెక్కలు చూస్తే రాష్ట్ర అప్పు 7 లక్షల19 వేల కోట్లు ఉన్నట్లు తేలిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అప్పులను తక్కువగా చూపెట్టి బీఆర్ఎస్ మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ చేసిన అప్పులకు నెలకు 6 వేల 500 కోట్ల రూపాయలు మిత్తిలే కడుతున్నామని తెలిపారు. ఆదివారం (డిసెంబర్ 8) మంత్రి పొంగులేటి మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు.
Also Read : గొడవలపై స్పందించిన మంచు ఫ్యామిలీ
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడి ఏడాది పూర్తయ్యిందన్నారు. అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లో ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణ మాఫీ చేశామని గుర్తు చేశారు. పేద విద్యార్థుల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో 55 ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన ఘనత మాదేనన్నారు. విద్యార్థులకు కాస్మొటిక్ చార్జీలను పెంచి చదువులకు తోడ్పాటును అందిస్తున్నామని పేర్కొన్నారు.