రూ.2 లక్షల రుణమాఫీ కానీ రైతులకు మంత్రి పొంగులేటి గుడ్ న్యూస్

రూ.2 లక్షల రుణమాఫీ కానీ రైతులకు మంత్రి పొంగులేటి గుడ్ న్యూస్

వెలుగు, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేసింది. మొత్తం మూడు దశల్లో రుణమాఫీ ప్రాసెస్‎ను కంప్లీట్ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అయితే, వివిధ కారణాల వల్ల కొందరు రైతులకు లోన్ మాఫీ కాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు రుణమాఫీ కానీ రైతులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతుకు పంట రుణం మాఫీ అవుతోందని స్పష్టం చేశారు. 

రుణమాఫీ కానీ రైతులకు ఒక కటాఫ్ డేట్ ఫిక్స్ చేసి లోన్ మాఫీ చేస్తామన్నారు. రుణమాఫీ కోసం రూ.31 వేల కోట్ల కంటే ఎక్కువైనా భరించటానికి సర్కార్ సిద్ధంగా ఉందని తెలిపారు. రుణమాఫీ కానీ రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. రైతులు బీఆర్ఎస్ నేతల మాటలు వినొద్దని.. రుణమాఫీపై మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్ లీడర్లకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ సర్కార్ చేసిన రైతు రుణమాఫీ వడ్డీలకే సరిపోలేదని ఎద్దేవా చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలా తూతూ మంత్రంగా కాకుండా రైతుల రుణ విముక్తే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ రుణమాఫీ చేసిందన్నారు. శుక్రవారం గాంధీభవన్‎లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ధనిక తెలంగాణ అని చెప్పి కేసీఆర్ రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ఫైర్ అయ్యారు. తెలంగాణలో మేం అధికారం చేపట్టే నాటికి రాష్ట్ర అప్పు రూ.7.19 లక్షల కోట్లు ఉందని వెల్లడించారు. 

ALSO READ | ఈస్ట్ హైదరాబాద్ వైపు కూడా ఐటీ హబ్‎లు వచ్చేలా చూస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

రూ.7 లక్షల కోట్ల అప్పులున్నా అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు హామీలు అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే 5 గ్యారెంటీలు అమలు చేశామని గుర్తు చేశారు. రైతు రుణమాఫీ కోసం గత బీఆర్ఎస్ సర్కార్ ప్రభుత్వ భూములు అమ్మేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీపై బీఆర్ఎస్ నేతల్లాగా మాకు అబద్ధాలు చెప్పడం రాదన్న పొంగులేటి.. ఎన్ని ఇబ్బందులు ఉన్న ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీ చేశామని అన్నారు.