ఆగస్టు నెలాఖరు లోపు ఇందిరమ్మ ఇండ్లు: మంత్రి పొంగులేటి

  • ప్రతి సెగ్మెంట్ కు 3,500 చొప్పున నిర్మిస్తం మంత్రి  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
  • భూపాలపల్లిని ఆదర్శంగా తీర్చిదిద్దుతం: పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబు
  • ఐటీ ఇండస్ట్రీస్ కూడా తీసుకొస్తం: పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క

హైదరాబాద్: ఆగస్టు 2024 నెలాఖరు లోపు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఇవాళ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ వద్ద 50 కోట్లతో 60 ఎకరాలలో ఇండస్ట్రియల్ పార్క్ నకు  మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దద్దిళ్ల శ్రీధర్ బాబు, సీతక్క శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్బంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కు 3,500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లను నిర్మించనున్నట్టు చెప్పారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ వెనుకబడిన భూపాలపల్లి ప్రాంతానికి ఇండస్ట్రియల్  పార్కు రావడం సంతోషించదగ్గ విషయమన్నారు. ప్రతి సెగ్మెంట్ లో మినీ ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. వ్యవసాయం, సంక్షేమం రెండు కళ్లలా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు.  

ఇచ్చిన మాట ప్రకారం రైతూ రుణమాఫీ, రైతు భరోసా ,పంటకు ఇన్షు రెన్స్,విత్తనాలకు సబ్సిడీ ఇచ్చామని చెప్పారు. ఈ ఇండస్ట్రియల్ పార్కు లో 200 పరిశ్రమలను ఏర్పాటుకు చేస్తామన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. చాలా మంది ఐటీ పరిశ్రమలను కూడా తీసుకు రావాలని కోరుతున్నారని చెప్పారు. ఐటీ ఇండస్ట్రీస్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. గత ప్రభుత్వం ధరణి తీసుకొచ్చి రైతులను ఇబ్బందుల పాలు చేసిందని అన్నారు. తాము భూమాత ద్వారా సమస్యలను పరిష్కరించబోతున్నామని చెప్పారు.  

కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణ రావు అధ్యక్షత వహించగా..  వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ రావు, కే ఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి కిరణ్ ఖరే తదితరులు పాల్గొన్నారు.