మానవత్వం చాటుకున్న మంత్రి పొంగులేటి

సూర్యాపేట: రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన మానవత్వాన్ని చాటుకున్నారు.  2024, జూన్ 23వ తేదీ ఆదివారం సాయంత్రం ఖమ్మం జిల్లా పర్యటనను ముగించుకుని కూసుమంచి నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలో రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిని సకాలంలో ఆస్పత్రికి తరలించి ఆదుకున్నారు మంత్రి.

 సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండల కేంద్రంలో కారుని ప్రమాదవశాత్తు బైక్ ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న వాహనదారుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటనను గమనించిన మంత్రి పొంగులేటి..  తన కన్వాయిలోని ఓ వాహనంలో క్షతగాత్రుడిని చికిత్స కోసం స్థానికంగా ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. స్థానిక ప్రజలు, క్షతగాత్రుని కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటికి కృతజ్ఞతలు తెలిపారు.