కాపలా కుక్కలే వేట కుక్కలైనయ్..ధరణిని అడ్డుపెట్టుకొని భూములు చెరబట్టారు : మంత్రిపొంగులేటి శ్రీనివాస్​రెడ్డి

కాపలా కుక్కలే వేట కుక్కలైనయ్..ధరణిని అడ్డుపెట్టుకొని భూములు చెరబట్టారు : మంత్రిపొంగులేటి శ్రీనివాస్​రెడ్డి
  • బీఆర్ఎస్​పై మంత్రిపొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ఫైర్​
  • ధరణి దోపిడీపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయిస్తామని ప్రకటన

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రానికి కాప‌లా కుక్కల్లా ఉంటాన‌న్న గ‌త ప్రభుత్వ పెద్దలు వేట కుక్కల్లా మారి ధరణి సాయంతో వేల కోట్ల విలువైన భూములను దోచుకున్నారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి పేరుతో దొర (కేసీఆర్) చేసిన తప్పుకు  రాష్ట్ర ప్రజలు శిక్ష అనుభవించారన్నారు.  శుక్రవారం అసెంబ్లీలో భూ భారతి బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత అందులోని ముఖ్యాంశాలను మంత్రి పొంగులేటి సభకు వెల్లడించారు.‘‘గత ప్రభుత్వ పెద్దలు క్షేత్రస్థాయిలో భూ బాధితుల కష్టాలను ఏ మాత్రం అర్థం చేసుకోకుండా ఎలాంటి సమస్యల్లేవంటూ బుకాయించారు.  

చాలామంది రైతులు భూ సమస్యలతో అధికారుల చుట్టూ తిరిగి పరిష్కారం కాక ఆత్మహత్యలు చేసుకున్నారు. దళిత రైతు మ‌‌‌‌‌‌‌‌ద్దెల కిష్టయ్యలా మరే రైతూ ప్రాణం తీసుకోవద్దనే ధరణి స్థానంలో భూభారతి తెచ్చాం. గత ప్రభుత్వ హయాంలో ధరణి ద్వారా జరిగిన భూ దోపిడీపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయిస్తాం’’ అని పొంగులేటి  ప్రకటించారు. రాష్ట్రంలోని భూ య‌‌‌‌‌‌‌‌జమానులందరికీ మేలు చేసే విధంగా విస్తృతస్థాయి ప్రజాభిప్రాయ సేక‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌తో  భూ భార‌‌‌‌‌‌‌‌తి చ‌‌‌‌‌‌‌‌ట్టం రూపొందించామని వెల్లడించారు. ఇది భూ య‌‌‌‌‌‌‌‌జ‌‌‌‌‌‌‌‌మానుల‌‌‌‌‌‌‌‌కు చుట్టంగా ఉంటుందని తెలిపారు.

 “ధ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌ణిలో నా భూమి నేను చూసుకొనే వీల్లేదు. అంతా ర‌‌‌‌‌‌‌‌హ‌‌‌‌‌‌‌‌స్యమే.  ఇందిర‌‌‌‌‌‌‌‌మ్మ ప్రభుత్వంలో దొర‌‌‌‌‌‌‌‌లు, సామాన్యుల‌‌‌‌‌‌‌‌కు ఒక‌‌‌‌‌‌‌‌టే విధానం. అంతా పారదర్శకమే’’ అని పేర్కొన్నారు. “ఆనాటి బ్రిటిష్ దొర‌‌‌‌‌‌‌‌లు, జ‌‌‌‌‌‌‌‌మీందారులు, భూస్వాములు ద‌‌‌‌‌‌‌‌ళారుల‌‌‌‌‌‌‌‌ను సృష్టించి శిస్తు పేరిట భూములను లాక్కుంటే, వేలాది పుస్తకాలు చదివిన అపర మేధావి, న‌‌‌‌‌‌‌‌యా నిజాం, ధ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌ణి సృష్టికర్త అయిన ఈ దొర (కేసీఆర్​) భూముల డిజిట‌‌‌‌‌‌‌‌లైజేష‌‌‌‌‌‌‌‌న్ పేరుతో ధ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌ణిని సృష్టించి భూ దోపిడీకి పాల్పడ్డారు. పదేండ్లు రాష్ట్రం ధృత‌‌‌‌‌‌‌‌రాష్ట్ర కౌగిలిలో చిక్కుకుంది. ఆ పెద్దమ‌‌‌‌‌‌‌‌నిషి చేసిన పాప ఫ‌‌‌‌‌‌‌‌లితాన్ని రైతులు అనుభ‌‌‌‌‌‌‌‌వించాల్సిన దుస్థితి దాపురించింది.

ప్రజ‌‌‌‌‌‌‌‌లు దింపేసినా వారి బుద్ధి మార‌‌‌‌‌‌‌‌డం లేదు ” అని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. భూ సంస్కర‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌పై ప్రముఖ న్యాయ‌‌‌‌‌‌‌‌ కోవిదుడు ప‌‌‌‌‌‌‌‌డాల రామిరెడ్డి రాసిన పుస్తకం ఎప్పుడూ ఆనాటి సీఎం కేసీఆర్ టేబుల్ పై క‌‌‌‌‌‌‌‌నిపించేద‌‌‌‌‌‌‌‌ని త‌‌‌‌‌‌‌‌న సెల్ ఫోన్‌‌‌‌‌‌‌‌లోని ఫొటోను మంత్రి చూపించారు. 80 వేల‌‌‌‌‌‌‌‌కు పైగా పుస్తకాలు చ‌‌‌‌‌‌‌‌దివాన‌‌‌‌‌‌‌‌ని చెప్పుకుంటున్న కేసీఆర్ తెచ్చిన లోప‌‌‌‌‌‌‌‌భూయిష్టమైన‌‌‌‌‌‌‌‌ ధరణికి మూడేండ్లకే నూరేండ్లు నిండిపోయాయని ఎద్దేవా చేశారు. కాగా, ఇందిరమ్మ రాజ్యంలో దళిత రైతు మద్దెల కృష్ణయ్య లాంటి పరిస్థితి మరొకరికి రాకుండా ఉండేందుకే భూ భారతి చట్టాన్ని రూపొందించామని  తెలిపారు. 

ప్రతిపక్ష ఎమ్మెల్యేల తీరు బాధాకరం

భూ భార‌‌‌‌‌‌‌‌తి చ‌‌‌‌‌‌‌‌ట్టాన్ని స‌‌‌‌‌‌‌‌భ‌‌‌‌‌‌‌‌లో ప్రవేశపెడుతుండ‌‌‌‌‌‌‌‌గా స్పీక‌‌‌‌‌‌‌‌ర్ తోపాటు కాంగ్రెస్ స‌‌‌‌‌‌‌‌భ్యుల‌‌‌‌‌‌‌‌పై కొందరు బీఆర్ఎస్ సభ్యులు కాగితాలు విస‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌డం దుర‌‌‌‌‌‌‌‌దృష్టకరమని మంత్రి పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు.  సభ్య స‌‌‌‌‌‌‌‌మాజం సిగ్గుప‌‌‌‌‌‌‌‌డేలా వారు గూండాయిజానికి పాల్పడ‌‌‌‌‌‌‌‌డం దారుణమని పేర్కొన్నారు. దీనిపై స్పీకర్ త‌‌‌‌‌‌‌‌గిన చర్యలు తీసుకోవాలని కోరారు. అసెంబ్లీలో తొలిసారి మంత్రి హోదాలో   గొప్ప బిల్లును ప్రవేశ‌‌‌‌‌‌‌‌పెడుతుండ‌‌‌‌‌‌‌‌గా ప్రధాన ప్రతిప‌‌‌‌‌‌‌‌క్ష నేత స‌‌‌‌‌‌‌‌భ‌‌‌‌‌‌‌‌కు రాక‌‌‌‌‌‌‌‌పోవ‌‌‌‌‌‌‌‌డం బాధాకరమని అన్నారు. ప్రజ‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌పై ఆయ‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌కు ఉన్న నిబ‌‌‌‌‌‌‌‌ద్ధత ఏంటో తెలుస్తున్నదని చెప్పారు.  

భూ భార‌‌‌‌‌‌‌‌తిపై స‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌హాలు, సూచ‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌ల కోసం ప‌‌‌‌‌‌‌‌బ్లిక్ డొమైన్‌‌‌‌‌‌‌‌లో పెట్టామ‌‌‌‌‌‌‌‌ని, మ‌‌‌‌‌‌‌‌రోవైపు సీనియ‌‌‌‌‌‌‌‌ర్ ఎమ్మెల్యే హ‌‌‌‌‌‌‌‌రీశ్​రావు ఏడు పేజీల సూచ‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌లు ఇచ్చార‌‌‌‌‌‌‌‌ని మంత్రి గుర్తుచేశారు. ఇలాంటి అత్యంత ప్రాధాన్యత ఉన్న బిల్లును ప్రవేశ‌‌‌‌‌‌‌‌పెడుతుండ‌‌‌‌‌‌‌‌గా కేవ‌‌‌‌‌‌‌‌లం కేటీఆర్ పై న‌‌‌‌‌‌‌‌మోదైన వ్యక్తిగ‌‌‌‌‌‌‌‌త కేసును తెర‌‌‌‌‌‌‌‌పైకి తెచ్చి అసెంబ్లీలో గంద‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌గోళం సృష్టించ‌‌‌‌‌‌‌‌డం రాష్ట్ర ప్రజ‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌ను అవ‌‌‌‌‌‌‌‌మానించ‌‌‌‌‌‌‌‌డం, వారి ఆశ‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌పై నీళ్లు చ‌‌‌‌‌‌‌‌ల్లడ‌‌‌‌‌‌‌‌మేన‌‌‌‌‌‌‌‌ని మంత్రి అన్నారు.