పెద్ద కొడుకుగా.. పాలేరు ప్రజల రుణం తీర్చుకుంటా: మంత్రి పొంగులేటి

పెద్ద కొడుకుగా.. పాలేరు ప్రజల రుణం తీర్చుకుంటా: మంత్రి పొంగులేటి

ఖమ్మం జిల్లా రూరల్ మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రజల వద్దకు పాలన పేరుతో ఆదివారం వివిధ గ్రామాల్లో పర్యటించి ప్రజల నుంచి గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  ప్రజల నుంచి దరఖాస్తులను తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మీ ఆశీర్వాదంతో మీ తనను భారీ మెజార్టీతో గెలిపించారని అన్నారు.  మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా.. మంత్రిగా అవకాశం వచ్చిందన్నారు. తాను పాలేరు ప్రజలకు పెద్ద కొడుకుగా పనిచేసి.. మీ రుణం తీర్చుకుంటానని భరోసా ఇచ్చారు..

ఇందిరమ్మ రాజ్యం వస్తే.. మీ సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు పొంగులేటి. మీ సమస్యల పరిష్కారం కోసం మీ వద్దకే వచ్చానన్నారు.  గ్రామాల్లో ఉండే సీసీ రోడ్లు, భూమి సమస్య, ఇందిరమ్మ ఇళ్లు, విద్యుత్ సమస్య వంటివి ఎక్కువగా తన దృష్టికి వచ్చాయని చెప్పారు.

 వీటన్నింటినీ ఎన్నికల కోడ్ తర్వాత దశల వారీగా పరిష్కారిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కొద్దిమంది అధికారులు తమ పని తాము చేసుకోకుండా రాజకీయం చేస్తున్నారని.. వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రానున్న కొద్ది రోజుల్లో గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేసుకొని అన్ని సమస్యలను పరిష్కరించుకునేలా ప్రణాళిక సిద్ధం చేసుకుందామని మంత్రి చెప్పారు.