
- ఇందిరమ్మ ఇండ్లలో గిరిజనులకు ప్రాధాన్యం
కూసుమంచి,వెలుగు; ‘కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది మాత్రమే చెబుతుంది. ఎంత కష్టం అయినా సరే చెప్పింది పక్కాగా అమలు చేస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా ఫోటోలకు ఫోజు లిచ్చుడు తెలియదు. కల్లబొల్లి మాటలు రావు.. గిరిజనుల సంక్షేమానికి కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉంది. వారి అభ్యున్నతికి పెద్దపీట వేస్తం’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం కూసుమంచిలో జరిగిన సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్లలో గిరిజనులకు ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. అన్ని వర్గాల ప్రజల ఆశ్వీరాదంతోనే ప్రజాప్రభుత్వం ఏర్పడిందన్నారు. కూసుమంచిలో సేవాలాల్ మహారాజ్ ఆలయం, ఆడిటోరియం నిర్మాణానికి సహకరిస్తామన్నారు. అనంతరం గిరిజనులు మంత్రి పొంగులేటిని సన్మానించారు. ఈకార్యక్రమంలో గిరిజన నాయకులు,గిరిజనులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మధిర : మధిరలో ఆదివారం రాత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఇటీవల మృతి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు వేమిరెడ్డి పెద్ది రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. అంతకు ముందుకు పీవీఆర్ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మిర్యాల రమణగుప్త, లావణ్య దంపతుల కుమార్తె సాత్విక, స్వరాజ్ రంగ వివాహవేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.