వచ్చే నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లు కట్టాలని టార్గెట్ గా పెట్టుకున్నామని చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అవినీతి లేకుండా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు పొంగులేటి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన .. పదేండ్లలో హౌసింగ్ సెక్టార్ ను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్లు అని అన్నారు.
ALSO READ | అమిత్ షా రాజీనామా చేసే వరకు నిరసనలు ఆపం : ఎంపీ గడ్డం వంశీకృష్ణ
అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం..పేద వాళ్లకు మంచి చేకూరేలా మీరు పని చేయాలి. ఇటీవల ప్రభుత్వం చేపట్టింది సర్వే కాదు.. ఎలిజబులిటీ ఆఫ్ ఇందిరమ్మ ఇల్లు..పరిశీలన.. దరఖాస్తుదారుడు ఇచ్చిన వివరాలు నిజమా కాదా అనేది పూర్తి బాధ్యత అధికారులదే. నిరుపేద వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తాం. పాత కాంట్రాక్టర్ అనుకూలంగా ఉంటే వాళ్ళతో నిర్మాణం చేపిద్దాం. లేదంటే లబ్ధిదారులను గుర్తించి వారు నిర్మాణం చేసుకుంట అంటే నిధులు మంజూరు చేస్తాం. లబ్ధి దారులను గుర్తించడంలో చిన్న తప్పు జరిగినా కఠిన చర్యలు. గతంలో స్లాబ్ వేసి 3 సంవత్సరాలు గడిచినా లబ్ధి దారులకు నిధులు మంజూరు కాలేదు. అలాంటి వాటికి వెంటనే నిధులు మంజూరు చేయాలి. డబుల్ బెడ్ రూమ్ టవర్స్ విషయంలో పూర్తికాని వాటిని వెంటనే పూర్తి చేయాలి. పూర్తి చేయడానికి మరోసారి కాంట్రాక్టర్ కు అవకాశం. పాత రేట్ల ప్రకారం కాంట్రాక్టర్ ముందుకు రాకపోతే కాంట్రాక్ట్ క్లోజ్ చేయాలి. గ్రీన్ ఛానెల్ ద్వారా డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.