పది రోజుల్లో ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ ప్రారంభం : పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి

పది రోజుల్లో ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ  ప్రారంభం : పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ పదిరోజుల్లో ప్రారంభం అవుతోందని  గృహనిర్మాణ, ఐఅండ్​ పీఆర్​, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి అన్నారు. టేకులపల్లి మండలంలో మంత్రి సోమవారం పర్యటించారు. మండలంలో రూ. 17.38కోట్లతో చేపడ్తున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి రాష్ట్రంలోని కాంగ్రెస్​ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. ఇండ్ల స్థలం ఉండి ఇల్లు లేని అర్హులైన వారికి  వారికి ఇల్లు కట్టుకునేందుకు రూ. 5లక్షలు ఇవ్వనున్నట్టు తెలిపారు. 

అర్హులైన పేదలందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇండ్లు సాంక్షన్​ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు తెలిపారు. ప్రజల వద్ద నుంచి వినతిపత్రాలు తీసుకున్నారు. 

ఈ ప్రోగ్రాంలో కలెక్టర్​ జితేష్​ వి పాటిల్​, ఐటీడీఏ పీఓ రాహూల్​, ఈఈలు శ్రీనివాస్​, వెంకటేశ్వరరావు, చారి, తిరుమలేష్​, ఇల్లెందు మున్సిపల్​ చైర్మన్​ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్​ నేతలు భూక్యా దళ్​ సింగ్​, ఏలూరి కోటేశ్వరరావు, దేవా నాయక్​, రెడ్యా నాయక్​ పాల్గొన్నారు. మంత్రి పర్యటన సందర్భంగా పోలీస్​లు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

5న ఇందిరమ్మ యాప్ ప్రారంభం

నేలకొండపల్లి, వెలుగు:  సంక్రాంతి పండుగ తర్వాత రైతులకు రైతు భరోసా ఇస్తామని రాష్ట్ర రెవెన్యూ  మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని గువ్వలగూడెం, కొత్తూరు, బైరవునిపల్లి, మంగాపురం తండ, రాయిగూడెం గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత సంవత్సరం డిసెంబరు మూడున ఎన్నికల ఫలితాలు వచ్చాయని  అందరి దీవెనలతో ఎమ్మెల్యే గా గెలవడంతో పాటు మంత్రి అయ్యాయని అన్నారు. 

 ప్రభుత్వం రైతును రాజును చేయాలని అనేక కార్యక్రమాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టారని దానిలో భాగంగానే  రూ. 2800 కోట్ల  రెండు లక్షల రైతులకు  రుణమాఫీ  చేశామన్నారు.  ఈ సంవత్సరం 3500 ఇళ్లు మంజూరు చేస్తామని , రానున్న నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని అన్నారు.  కార్యక్రమంలో మంత్రి వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, నాయకులు నెల్లూరి భద్రయ్య, శాఖమూరి రమేష్, కొడాలి గోవిందరావు, బొడ్డు బొందయ్య, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు షేక్ ఖాజామియా పాల్గొన్నారు.