పగడ్భందీగా భూ భారతి విధివిధానాలు.. త్వరలోనే చట్టం అమలు: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

పగడ్భందీగా భూ భారతి విధివిధానాలు.. త్వరలోనే చట్టం అమలు: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

పగడ్భందీగా కొత్త రెవెన్యూ చట్టం భూ భారతి విధివిధానాలు రూపొందిస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. హైదరాబాద్ లోని ఎంసీహెచ్ఆర్డీలో రెవెన్యూశాఖ అధికారులతో సమీక్ష జరిపిన పొంగులేటి.. గత సర్కార్ హయాంలోని రెవెన్యూ చట్టంలో అన్నీ లోపాలు,లొసుగులే ఉన్నాయన్నారు.  చట్టం తీసుకొచ్చి మూడేళ్లైనా విధివిధానాలు రూపొందించలేదన్నారు. 

మేధావులు,నిపుణులతో చర్చించి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం భూ భారతిని తీసుకొచ్చిందని చెప్పారు పొంగులేటి. భూ భారతి చట్టం తరతరాల సమస్యలకు  శాశ్వత పరిష్కారం చూపిస్తుందన్నారు. వీలైనంత త్వరగా విధివిధానాల రూపొందించి..  భూ భారతి రెవెన్యూ చట్టాన్ని అమలు చేస్తామని తెలిపారు.  భూ భారతి చట్టం పెను మార్పులు తీసుకొస్తుందన్నారు పొంగులేటి.

Also Read :- గృహిణి పేరుతోనే కొత్త రేషన్ కార్డులు?

2024 డిసెంబర్ 20 తెలంగాణ భూ భారతి (భూహక్కుల చట్టం)–2024  బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.   2025జనవరి 9న తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు.