జర్నలిస్టులందరికి త్వరలో ఇళ్ళ స్థలాలు : పొంగులేటి

జర్నలిస్టులందరికి త్వరలో  ఇళ్ళ స్థలాలు : పొంగులేటి

అనుభవం, అర్హత కలిగిన జర్నలిస్టులందరికి త్వరలో   ఇళ్ళ స్థలాలు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.  జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పాలసీ తీసుకొస్తామన్నారు. వరంగల్ నగరంలో నాళాలు ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారు. బఫర్ జోన్ లల్లో నిర్మాణాల్లో అధికారులు గుర్తించాలని ఆదేశించారు. బీపీఎల్  కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామన్నారు. నాలాలపై నిర్మించిన ఇళ్లను తొలగిస్తామన్నారు. బడా బాబులు కబ్జాలు చేస్తే ఊరుకోమన్నారు. ఎవరైనా, ఎంతటి వారైనా సరే వదిలి పెట్టేది లేదంటూ  అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ALSO READ | కాంగ్రెస్​ ప్రభుత్వం రైతును రాజు చేస్తుంది: మంత్రి సీతక్క

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు లో అర్హులైన పేదలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొంగులేటి. అక్టోబర్ 2 న కాళోజీ కళాక్షేత్రాన్ని  సీఎం రేవంత్ ప్రారంభిస్తారని చెప్పారు. ఏమైనా పెండింగ్ పనులు ఉంటే.. పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇన్నర్ రింగ్  రోడ్డు పనులు స్పీడ్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎయిర్ పోర్ట్ పై అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. పూర్తి సమాచారం దగ్గర ఉంచుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశాలు.