- ఇంద్రవెల్లిలో మరో రెండు గ్యారంటీల ప్రకటన
ఖమ్మం: టీడీపీ, కాంగ్రెస్ పార్టీ వేర్వేరు కాదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇవాళ న్యూ డెమోక్రసీ ప్రజాపంథా, సీపీఐ, టీడీపీ కార్యాలయాలకు మర్యాద పూర్వకంగా ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా టీడీపీ ఆఫీసులో ఆయన మాట్లాలడుతూ కాంగ్రెస్ అధికారంలో ఉన్న చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. భవిష్యత్ రాజకీయాల్లో కలిసి ప్రయాణం చేద్దామని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో టీడీపీకి ఏమీ లాభం లేకపోయినా ప్రజల అభీష్టం మేరకు కాంగ్రెస్కు మద్దతు తెలిపారన్నారు. తెలంగాణ ప్రజలు ఏది కావాలనుకున్నారో అది నెరవేరిందన్నారు. సీపీఐ ఆఫీసులో మాట్లాడుతూ 2న ఇంద్రవెల్లిలో మరో రెండు గ్యారంటీలు ప్రకటిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తుందన్నారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.