లైవ్లో కన్నీరు పెట్టిన మంత్రి పొంగులేటి

లైవ్లో కన్నీరు పెట్టిన మంత్రి పొంగులేటి

హైదరాబాద్: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. ఖమ్మం జిల్లాల్లో మున్నేరు వాగులో చిక్కుకున్న కుటుంబ పరిస్థితిని వివరిస్తూ..లైవ్ లో కన్నీ రు పెట్టుకున్నారు. ఖమ్మంలోని ప్రకాశ్ నగర్ లో ఓ బ్రిక్స్ తయారీ యూనిట్ నిర్వహిస్తున్న నిరుపేద కుటుంబం మున్నేరు వాగు వరదల్లో చిక్కుకుంది..వరద ప్రవా హం చుట్టుముట్టిన ఇంటిపై బిక్కుబిక్కుమంటూ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. 

బాధితులతో మాట్లాడిన పొంగులేటి.. వారికి ధైర్యం చెప్పారు. హెలికాప్టర్లు పంపించేందుకు ప్రయత్నించారు.. కానీ వాతావరణ సహకరించకపోవడంతో సాధ్యం కాలేదు.. అయితే డ్రోన్ ద్వారా బాధితులకు సేఫ్టీ జాకెట్లు పంపించారు.

ALSO READ | మున్నేరు వాగు ఉగ్రరూపం..వరదల్లో చిక్కుకున్న ముగ్గురు యువకులు

అయితే ఇంతలోనే వరద ఉధృతి పెరిగి ఇంటి గోడ కూలిపోయిందని మంత్రి పొంగులేటి మీడియాతో చెప్పారు.. లైఫ్ జాకెట్లు ఉన్నాయి.. వారు క్షేమంగా బయటికి రావాలని కోరుకుంటున్నానని  కంటనీరు పెట్టుకున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.