
దొరల కోసం నాడు కేసీఆర్ ధరణి తెచ్చారని మండిపడ్డారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. భూభారతి చట్టం పోర్టల్ ప్రారంభోత్సవం సందర్బంగా మాట్లాడిన ఆయన.. ధరణితో సామాన్యులు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పారు. ఆనాటి దొరలు తెచ్చిన చట్టం వారి స్వార్థం కోసం తెచ్చారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక ధరణిని బంగాళాఖాతంలో వేస్తామన్నం..వేశామన్నారు. ధరణితో కంటిమీద కుణుకులేకుండా చేశారన్నారు. కేసీఆర్ పేరుకు ధరణి చట్టం తెచ్చారు కానీ రూల్స్ లేవన్నారు. దొరకు తెల్లవారుజామున ఏ ఆలోచన వస్తే అదే రూల్ అని సెటైర్ వేశారు పొంగులేటి.
వీఆర్వో, వీఆర్ ఏలు చెప్పినట్టు వినలేదని కేసీఆర్ అందరినీ తొలగించారు. భూభారతి చట్టంతో అధికారులు అహర్నిశలు కష్టపడ్డారు. కలెక్టర్ల దగ్గరున్న కొన్ని పవర్స్ ను కింది అధికారులకు ఇచ్చాం. పలు రాష్ట్రాల్లో ఉన్న భూచట్టాలను అధ్యయనం చేసి..చట్టాన్ని రూపొందించాం. హరీశ్ రావులాంటి వాళ్లు ఇచ్చిన సలహాలు,సూచనలను కూడా భూభారతిలో చేర్చాం. 2020 చట్టం చేయకుముందు రైతులు సంతోషంగా ఉన్నారు.
Also Read :- భూభారతి పోర్టల్ ప్రారంభించిన సీఎం రేవంత్..
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్న రైతుల కోసం కష్టపడ్డాం. నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా అమలు చేస్తున్నాం. ఏప్రిల్ 17 నుంచి రెవెన్యూ అధికారులే మీ గ్రామాలకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తారు. మే మొదటి వారంలో ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా చేస్తాం. జూన్ 2 తర్వాత ప్రతి మండలానికి రెవెన్యూ అధికారులు మీ గ్రామాలకే వస్తారు. భూములున్న ఆసాములు,రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ చట్టం రూపొందించే అవకాశం వచ్చినందుకు నా జన్మ ధన్యమైంది. అని పొంగులేటి అన్నారు.