మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం: మంత్రి పొంగులేటి

మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం: మంత్రి పొంగులేటి

అర్హులైన ప్రతి జర్నలిస్టును ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు మంత్రి పొంగులేటి. రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో JNJHSకు భూమిపత్రాల అందజేత కార్యక్రమానికి సీఎం చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. 1105 మంది జర్నలిస్టులకు 35 ఎకరాల్లో పేట్ బహీర్ బాగ్ దగ్గర ఇంటిస్థలం కేటాయించారు. 

తమది మాటల ప్రభుత్వం కాదని..చేతల ప్రభుత్వమన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. గత ప్రభుత్వంలో జర్నలిస్టులకు స్వేచ్ఛ అనేది లేదన్నారు. ప్రభుత్వం ఏ మంచిపనిచేసినా.. బీఆర్ఎస్ విమర్శించడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు మంత్రులు.