నవంబర్ 13న గాంధీభవన్​లో ముఖాముఖికి పొంగులేటి

హైదరాబాద్, వెలుగు: గాంధీభవన్ లో బుధవారం నిర్వహించే మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి  మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరు కానున్నారు. 11 గంటల నుంచి కార్యక్రమం ఉంటుందని టీపీసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. 

ప్రజలు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు వారి విజ్ఞప్తులను అందజేయాలని కోరింది.