ఖమ్మం–వరంగల్ అలైన్​మెంట్ మార్చండి

ఖమ్మం–వరంగల్ అలైన్​మెంట్ మార్చండి
  • దక్షిణ మధ్య రైల్వే జీఎంకు మంత్రి పొంగులేటి విజ్ఞప్తి

సికింద్రాబాద్, వెలుగు: దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్​కుమార్​జైన్​తో మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి భేటీ అయ్యారు. బుధవారం సికింద్రాబాద్ లోని రైల్ నిలయానికి వచ్చిన ఆయన.. ఖమ్మం-–వరంగల్ అలైన్​మెంట్ పై జైన్ తో చర్చించారు. ఆ అలైన్​మెంట్​లో మార్పులు చేయాలని కోరారు. ప్రతిపాదిత మార్గం వల్ల పాలేరులోని రైతులు సాగు భూములు కోల్పోవాల్సి వస్తున్నదని, రైతులకు నష్టం జరుగకుండా అలైన్​మెంట్​లో మార్పులు చేయాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే కాకతీయ  అర్బన్​డెవలప్​మెంట్​అథారిటీ మాస్టర్ ప్లాన్​ను పరిగణలోకి తీసుకుని వరంగల్​బై-పాస్​రైల్వే లైన్ ను నిర్మించాలని కోరారు. ఈ సందర్భంగా ఖమ్మం-–వరంగల్​మార్గంలో నిర్మిస్తున్న కొత్త రైల్వే లైన్ ప్లాన్​ను మంత్రికి అరుణ్ కుమార్ జైన్ వివరించారు.