మతతత్వ బీజేపీ ఆటలు ఇక సాగవ్

మతతత్వ బీజేపీ ఆటలు ఇక సాగవ్
  • రాబోయే పదేళ్లూ కాంగ్రెస్ దే అధికారం
  • మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 

భద్రాద్రికొత్తగూడెం/కారేపల్లి, వెలుగు : మతతత్వ బీజేపీ ఆటలు ఇక సాగవని, రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు ప్రజలు సిద్ధమయ్యారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డితో కలిసి గురువారం రాత్రి కారేపల్లి అంబేద్కర్ సెంటర్ నుంచి బస్ స్టాండ్ సెంటర్ వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పదేళ్ల పాలనలో కేంద్రంలో మోదీ, రాష్ట్రం లో కేడీ తెలంగాణకు ఏమీ చేయలేదని ఆరోపించారు.

బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటేనని, కూతురును బెయిల్ పై బయటకు తెచ్చేందుకు కేసీఆర్ కమలనాథులతో ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. మాయ మాటలతో రాములోరిని సైతం రాజకీయం చేస్తున్నారని బీజీపీపై ధ్వజమెత్తారు. ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాల వారికి మేలు జరుగుతుందని భరోసానిచ్చారు. రఘురాం రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ఈ సభలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్, కాంగ్రెస్ నాయకులు బాలసాని లక్ష్మీనారాయణ ,రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి, బొర్రా రాజశేఖర్, పగడాల మంజుల, దుగ్గినేని శ్రీనివాసరావు,ఇమ్మడి తిరుపతిరావు, బానోతు రామ్మూర్తి పాల్గొన్నారు.

చుంచుపల్లిలో.. 

చుంచుపల్లి మండలంలో కాంగ్రెస్​ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో పలు పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ, రాజీవ్​గాంధీ దేశంలో తమ ప్రాణాలను అర్పించారన్నారు. 
రాహూల్​ గాంధీని ప్రధానిగా చేసేందుకు అందరూ కష్టపడాలని కోరారు.  నామా నాగేశ్వరరావును గెలిపిస్తే కేంద్రంలో మంత్రి పదవి వస్తోందని బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ చెప్తున్నారని, దీంతోనే బీఆర్​ఎస్, బీజేపీల డ్రామాలు తెలిసిపోతున్నాయని చెప్పారు.

అక్రమంగా సంపాదించిన డబ్బును జాతీయ పార్టీ పేర పక్క రాష్ట్రంలో పంచిన ఘనత కేసీఆర్​ది అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్​ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ ప్రోగ్రాంలో కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు పొదెం వీరయ్య, వైరా ఎమ్మెల్యే రాందాస్​ నాయక్, జడ్పీ చైర్మన్​ కంచర్ల చంద్రశేఖర్, కాంగ్రెస్ నాయకులు తూళ్లూరు బ్రహ్మయ్య, ఆళ్ల మురళి, పీ.గోపాల్​రావు, నాగ సీతారాములు

నాగేంద్ర త్రివేది, తోట దేవి ప్రసన్న, పిడమర్తి రవి, తూమ్​ చౌదరి, చీకటి కార్తీక్​, ఎడవల్లి కృష్ణ, డాక్టర్​ శంకర్​ నాయక్​, జేవీఎస్​ చౌదరి, గడిపల్లి కవిత, మండే వీర హనుమంతరావు, మండల ఆమని, పరమేశ్​​ పాల్గొన్నారు.  

4న సీఎం రేవంత్​ రాక.. 

 నెల 4న సీఎం రేవంత్​ రెడ్డి కొత్తగూడెంలో పర్యటించనున్నారని మంత్రి తెలిపారు. పట్టణంలోని ప్రకాశం స్టేడియంలో చేస్తున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.