పాలేరులో చేపపిల్లలను వదిలిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

పాలేరులో చేపపిల్లలను వదిలిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఖమ్మం: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.  ఖమ్మం జిల్లా  కూసుమంచి మండలం పాలేరు  ప్రాజెక్టు లో  ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.   త్వరలోనే ప్రభుత్వం పేదప్రజలకు ఇందిరమ్మ ఇళ్లను అందజేస్తుందన్నారు.   ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదోడి ముఖంలో చిరునవ్వు చూడటమే లక్ష్యమన్నారు.  ’  వరదల్లో కనివీని ఎరుగని రీతిలో ఇక్కడి ప్రజలు నష్టపోయారు. మత్స్యకారులకు తీవ్ర నష్టం మిగిల్చింది.  

ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తుంది.  చేపల పంపిణీ కార్యక్రమాన్ని పండుగలా చేస్తుంది.  ప్రభుత్వం పూర్తి సబ్సిడీతో చేపపిల్లల పంపిణీ చేస్తుంది. మృత్స్యకారులను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం.  గత ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమాన్ని పట్టించుకోలేదు.  రాజకీయ, ఆర్థికంగా ఈ సామాజికవర్గం డెవలప్​మెంట్​కావాలని సీఎం రేవంత్​ఆలోచనలు చేస్తున్నారు.  రాష్ట్రంలో అన్ని కులవృత్తులను ప్రోత్సహిస్తున్నం. మీ ఎమ్మెల్యేగా మీకు అండగా ఉంటా.. అందరికి అందుబాటులో ఉండి సేవ చేస్తా’ అని పొంగులేటి అన్నారు.

ALSO READ | రూల్స్ పాటించకుంటే లైసెన్స్ రద్దు : వాళ్ల పేరుతో నో రిజిస్ట్రేషన్స్