గ్రామాల్లోని అన్ని సమస్యలు పరిష్కరిస్తా : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

గ్రామాల్లోని అన్ని సమస్యలు పరిష్కరిస్తా : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

కూసుమంచి, వెలుగు : గ్రామాల్లోని అన్ని సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాస​రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం తిరుమలాయపాలెం మండంలోని  పలు గ్రామాల్లో ప్రజల నుంచి సమస్యలపై ఆయన వినతులు స్వీకరించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. సాగర్​ నుంచి నీరు రాకపోయినా గోదావరి నుంచి నీటిని పాలేరుకు తెప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, దీనికి కొంత సమయం పడుతుందని తెలిపారు. 

ఎన్నికల కోడ్​ ముగియగానే అధికారులతో మాట్లాడి ప్రతీ సమస్యను పరిష్కరిచేస్తానని చెప్పారు. గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించడం కోసం ఇప్పటికే రూ.1 45 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ బోడ మంగీలాల్, జడ్పీటీసీ బెల్లం శ్రీను, నరేశ్ రెడ్డి, మాజీ ఎంపీపీ కొఈప్పుల అశోక్​ పాల్గొన్నారు.